టాలీవుడ్ ఇండస్ట్రీలో కొద్ది రోజులుగా పెళ్లి భజాలు మోగుతున్న సంగతి తెలిసిందే. యంగ్ స్టార్ హీరోహీరోయిన్స్ ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈరోజు (డిసెంబర్ 04న) అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల వివాహం అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. అలాగే ఈ మరో హీరోయిన్ కీర్తి సురేష్ సైతం ఇదే నెలలో తన స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకోనుంది. ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది. అతడు మరెవరో కాదు.. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సాయి శ్రీనివాస్.
అల్లుడు శీను సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన సాయి శ్రీనివాస్ మొదటి చిత్రంతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సాయి శ్రీనివాస్.. ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఛత్రపతి రీమేక్ తో హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయినా అవకాశాలు మాత్రం తగ్గట్లేదు. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ చేతిలో నాగులు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భైరవం సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత టైసన్ నాయుడు మూవీతోపాటు మరో రెండు చిత్రాల్లో నటించనున్నాడు. తాజాగా సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ మీడియాతో మాట్లాడుతూ తన తనయుడి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
“మా పెద్దబ్బాయి లైఫ్ సెట్ అయిపోయింది. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఏప్రిల్ లో నేను ఇంకో సినిమా స్టార్ట్ చేస్తాను. శ్రీనివాస్ పెళ్లి వచ్చే సంవత్సరమే ఉండొచ్చు. అరేంజ్డ్ మ్యారేజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్లే. త్వరలేనే ప్రకటిస్తాము. చిన్న అబ్బాయి కెరీర్ ఇంకా సెట్ కావాలి. ఆ తర్వాత పెళ్లి ” అని చెప్పుకొచ్చారు బెల్లంకొండ సురేష్. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.