Prince Cecil: న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్.. వధువు ఎవరో తెలుసా?
టాలీవుడ్ హీరో ప్రిన్స్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. సాయి మాచిరాజు అనే అమ్మాయితో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టాడు. న్యూజిలాండ్ వేదికగా వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

టాలీవుడ్ హీరో ప్రిన్స్ సిసిల్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు సాయి మాచిరాజు మెడలో మూడుముళ్లు వేసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. సోమవారం (ఆగస్టు 24) న్యూజిలాండ్ వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు స్నేహితులు, సన్నిహితులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక తన పెళ్లి వేడుకల ఫొటోలను స్వయంగా ప్రిన్స్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇన్ స్టా స్టోరీలో తన పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. ‘ జీవితకాలపు బంధానికి స్వాగతం’ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే తన పోస్టుకు లవ్ ఎమోజీలను జోడించాడు. ప్రస్తుతం ప్రిన్స్- సాయి మాచిరాజు ల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అలా మొదలైన పరిచయం..
ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లిలో న్యూజిలాండ్‌కు చెందిన ఎన్నారై సాయి మాచిరాజుతో ప్రిన్స్‌కు పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే వీరు మంచి స్నేహితులయ్యారు. క్రమంగా ఫ్రెండ్ షిప్ కాస్తా ప్రేమగా చిగురించింది. ఇరు పెద్దల ఆశీర్వాదంతో ఈ ఏడాది జూన్ లో ప్రిన్స్- సాయిల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారీ లవ్ బర్డ్స్.
ప్రిన్స్ విషయానికి వస్తే.. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మారుతి తెరకెక్కించిన ‘బస్ స్టాప్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత హీరోగా చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దీంతో విలన్ గానూ, సహయక నటుడిగానూ రాణిస్తున్నాడీ యాక్టర్. నేను శైలజ హీరోయిన్ అన్నయ్యగా చేసిన ప్రిన్స్ డీజే టిల్లు, స్కంద, రీసెంట్ గా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీస్ లోనూ విలన్ గా ఆకట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ లోనూ పాల్గొని బుల్లితెర ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు ప్రిన్స్.
భార్యతో హీరో ప్రిన్స్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




