Rebel Star Prabhas: డార్లింగ్ షాకింగ్ డెసిషన్.. ఏకంగా ఐదారు నెలల పాటు షూటింగ్‌లకు బ్రేక్ !

డార్లింగ్ ప్రభాస్‌ బ్రేక్‌ తీసుకుంటున్నారు. ఏదో వారం, పది రోజులు కాదు.. ఏకంగా ఐదారు నెలల పాటు షూటింగ్‌లకు బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు ఇండియన్‌ సూపర్‌ స్టార్ ప్రభాస్‌.

Rebel Star Prabhas: డార్లింగ్ షాకింగ్ డెసిషన్.. ఏకంగా ఐదారు నెలల పాటు షూటింగ్‌లకు బ్రేక్ !

Updated on: Jan 18, 2021 | 4:57 PM

Rebel Star Prabhas: డార్లింగ్ ప్రభాస్‌ బ్రేక్‌ తీసుకుంటున్నారు. ఏదో వారం, పది రోజులు కాదు.. ఏకంగా ఐదారు నెలల పాటు షూటింగ్‌లకు బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు ఇండియన్‌ సూపర్‌ స్టార్ ప్రభాస్‌. కంగారుపడిపోకండి… డార్లింగ్‌ బ్రేక్ తీసుకునేది ఇప్పుడే కాదు.. ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ పూర్తయ్యాకే. అవును‌ రాధే శ్యామ్‌ షూటింగ్ లో ఉన్న ప్రభాస్‌ మూడు పాన్ ఇండియా సినిమాలు లైన్‌లో పెట్టారు. ‘సలార్’ ముహూర్తం జరిగింది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుంది. ‘ఆదిపురుష్’‌ కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ రెండు సినిమాలతో పాటు నాగ్‌ అశ్విన్ సినిమా పనులు కూడా చకచకా జరుగుతున్నాయి.

ఈ సినిమాల షూటింగ్‌ పూర్తయ్యే సరికి కనీసం వన్‌ అండ్‌ హాప్ ఇయర్ అయినా పడుతుంది. ఇంత బిజీ షెడ్యూల్స్ తరువాత వెంటనే మరో సినిమా చేయటం ఇష్టం లేదంటున్నారు ప్రభాస్‌. అందుకే లాంగ్ బ్రేక్‌ తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. కాస్త రిలాక్స్‌ అయ్యాక.. న్యూ ఎనర్జీతో న్యూ ప్రాజెక్ట్స్‌ ఓకే చెయ్యాలన్నది డార్లింగ్ ప్లానట. కెరీర్‌ పీక్స్‌లో ఉన్న ఈ టైంలో డార్లింగ్‌ బ్రేక్‌ తీసుకోవడం వెనుక రీజనేమై ఉంటుందా? అనే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి.

Also Read:

Shruti Haasan: సంచలన పాత్రకు ఓకే చెప్పిన శ్రుతి హాసన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఛాలెంజింగ్ రోల్స్

సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఝలక్.. ఇతర పార్టీల్లో చేరుతున్న అభిమానులు..అధిష్టానం స్పందన ఏంటంటే..?

Loading...
Unable to load recommendations.
Follow Us