రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చిన్న పిల్లాడిని అడిగిన చెప్తాడు. పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు ప్రభాస్. రీసెంట్ గా వరుస హిట్స్‌తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అంతే కాదు తన సినిమాతో ఏకంగా రూ. 1000కోట్ల వసూళ్లతో నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే.. అలాగే ప్రభాస్ బర్త్ డేకు ఫ్యాన్స్ గ్రాండ్ గా సంబరాలు చేసుకుంటుంటారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో అభిమానులంతా సిద్ధం అవుతున్నారు. ఈసారి రెబల్ స్టార్ బర్త్ డేను మరింత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా ప్రభాస్ పేరు ట్రెండ్ అయ్యేలా సోషల్ మీడియాను షేక్ చేయనున్నారు అభిమానులు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ బర్త్ డేస్ సందర్భంగా ఓ సూపర్ హిట్ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాను మరోసారి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అభిమానులను ఖుష్ చేశాయి. హిట్ అయిన సినిమాలే కాదు.. యావరేజ్ ఆడిన సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యి ఆకట్టుకున్నాయి.
కాగా ప్రభాస్ సినిమాలు కూడా రి రిలీజ్ అయ్యాయి. బిల్లా, యోగి సినిమాలు మరోసారి థియేటర్స్ లో సందడి చేశాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ సూపర్ హిట్ సినిమా సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఆ సినిమానే Mr. ఫర్ఫెక్ట్. దశరధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అప్పటివరకు మాస్ హీరోగా ఉన్న ప్రభాస్ ఈసినిమా తర్వాత లవర్ బాయ్ గా మారిపోయాడు. అక్టోబర్ 22న ఈ సినిమాను థియేటర్స్ లో రీ రిలీజ్ చేయనున్నారు. వీటితో పాటు ప్రభాస్ బర్త్‌డే కానుకగా ఈశ్వర్‌తో పాటు రెబల్, సలార్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇలా వరుసగా ప్రభాస్ సినిమాను థియేటర్స్ లో సందడి చేయనుండటంతో ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు. ఇక ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు రాజా సాబ్, సలార్ 2, హనురాఘవాపుడి మూవీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు మన డార్లింగ్.
The #Prabhas we love and the nostalgia we crave are back for a grand celebration! 🔥
Don’t miss the #MrPerfect re-release on October 22nd ❤️🔥
Bookings Open Now :https://t.co/RlpPBiOxEo
Theatres lo Dhol Dhol Dhol Bhale 😎🥁@directordasarad @ThisIsDSP @MsKajalAggarwal @taapsee… pic.twitter.com/hQ2mh6Ufe1
— Sri Venkateswara Creations (@SVC_official) October 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.