Nithiin 31: ‘మాచర్ల నియోజకవర్గం’లో మాస్ట్రో.. నితిన్ 31వ సినిమా టైటిల్ ప్రకటన..

Nithiin 31: వినాయక చవితి సందర్భంగా నితిన్ తన అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన 31వ సినిమా టైటిల్‌ ప్రకటించి అందరిని ఆశ్చర్యంతో ముంచెత్తారు.

Nithiin 31: ‘మాచర్ల నియోజకవర్గం’లో మాస్ట్రో.. నితిన్ 31వ సినిమా టైటిల్ ప్రకటన..
Nithiin 31
Follow us

|

Updated on: Sep 10, 2021 | 7:46 PM

Nithiin 31: వినాయక చవితి సందర్భంగా నితిన్ తన అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన 31వ సినిమా టైటిల్‌ ప్రకటించి అందరిని ఆశ్చర్యంతో ముంచెత్తారు. ‘మాచర్ల నియోజకవర్గం’ అంటూ టైటిల్ ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఇందులో చుట్టు నిప్పులు.. కత్తులు, ఇతర ఆయుధాలతో విలన్స్ ముందుకు వస్తుండగా నితిన్ మధ్యలో నిలబడి ఉన్నాడు. మాచర్ల నియోజకవర్గం అంటే పేరుకు తగ్గట్లు ఇది రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాగా తెలుస్తోంది.

కాగా ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దగ్గర పలు సినిమాలకు పనిచేసిన ఎస్.ఆర్.శేఖర్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘ఉప్పెన’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లపై ముహూర్తం షాట్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను కూడా నిఖిల్ తన సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సంస్థపై నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే మేర్లపాక గాంధీ దర్శకత్వం ‘మాస్ట్రో’ సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. తమన్నా భాటియా, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను నితిన్ సొంత నిర్మాణ సంస్థ ‘శ్రేష్ఠ్ మూవీస్’ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. కాగా మాస్ట్రో విడుదల కాకముందే మరో సినిమా ప్రకటించడంతో నితిన్ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు.

Viral Video: విమానం రెక్కకు ఊయల కట్టి ఊగుతున్న తాలిబాన్లు.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో..

Afghan-Taliban: పంజ్‌షీర్‌లో కొనసాగుతున్న తాలిబన్ల నరమేధం.. కేర్‌ టేకర్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా సలేష్‌ సోదరుడిని కాల్చివేత!

Vinayaka Chavithi:  విఘ్నాలు తొలగిపోవాలంటూ.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో గణపతికి ప్రత్యేక పూజలు చేసిన బాలకృష్ణ