Macherla Niyojakavargam Trailer: మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ అదిరిపోయిందిగా.. నితిన్ డైలాగ్స్ సూపర్ ..

తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కలెక్టర్ గా నితిన్ లుక్ అదిరిపోయింది. నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ లా పంచ్ లు, వీళ్లేమో బోయపాటి శ్రీనులా

Macherla Niyojakavargam Trailer: మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ అదిరిపోయిందిగా.. నితిన్ డైలాగ్స్ సూపర్ ..
Nithiin

Updated on: Jul 30, 2022 | 9:12 PM

యంగ్ హీరో నితిన్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam ). ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. డైరెక్టర్ ఏంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి. ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా శనివారం సాయంత్రం మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నితిన్ క్యాజువల్స్ లో స్టన్నింగా కనిపిస్తూనే ఇన్ బిల్ట్ ఊర మాస్ క్యారెక్టరైజేషన్ బ్రిలియంట్ అనిపించాడు. ముఖ్యంగా డైలాగ్స్ అదిరిపోయాయి. “నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పంచ్ లు, వీళ్ళేమో బోయపాటి శ్రీనుల యాక్షన్.. ఇప్పుడు నేనేం చెయ్యాలి..  రాజమౌళి హీరో లా ఎలివేషన్ ఇవ్వాలా”  ఈ ఒక్క డైలాగ్ వింటే సినిమా ఏ స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తోందో అర్ధమౌతుంది. ట్రైలర్‌లోని యాక్షన్‌ షాట్‌లు అడ్రినాలిన్‌ రష్ ఎఫెక్ట్ ని ఇచ్చాయి. అద్భుతమైన విజువల్స్, మాస్ డైలాగ్స్ ,క్రాకింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కూడిన యాక్షన్ ట్రైలర్‌ సెన్సేషనల్ గా వుంది. శ్రేష్ట్ మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. మహతి స్వర సాగర్ ట్రైలర్ కి ఇచ్చిన నేపధ్య సంగీతం పవర్ ప్యాక్డ్ అనిపించింది.

ఎంటర్టైన్మెంట్ తోపాటు యాక్షన్ తో తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో కేథరిన్ కీలకపాత్రలో నటిస్తుండగా.. హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us