The Ghost: ‘ది ఘోస్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడో తెలుసా..

|

Sep 21, 2022 | 7:20 PM

యాక్షన్ డ్రామా గా వస్తున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

The Ghost: ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడో తెలుసా..
Nagarjuna
Follow us on

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం నాగ్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ది ఘోస్ట్. డెరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్.. టీజర్ ఈ మూవీపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. యాక్షన్ డ్రామా గా వస్తున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 25న కర్నూల్ లో నిర్వహించనున్నారు. కర్నూల్ లోని ఎస్టీబీసీ గ్రౌండ్ లో సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.