Valentine’s Day: బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే.. కాస్తా నవ్వవే.. వైరల్ అవుతున్న నాగచైతన్య లవ్ ప్రపోజల్ వీడియో
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నాగ చైతన్య ఇప్పుడు తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే నాగ చైతన్య స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. దాదాపు ఏడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఆతర్వాత విడిపోయారు. నాగచైతన్య, సమంత విడిపోవడంతో చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. ఈ ఇద్దరూ విడిపోయిన తర్వాత ఎవరి సినిమాలతో బిజీగా ఉన్నారు.
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నాగ చైతన్య ఇప్పుడు తండేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే నాగ చైతన్య స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. దాదాపు ఏడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఆతర్వాత విడిపోయారు. నాగచైతన్య, సమంత విడిపోవడంతో చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. ఈ ఇద్దరూ విడిపోయిన తర్వాత ఎవరి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్య లవ్ ప్రపోజ్ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నారు నాగ చైతన్య. ఈ సినిమా మత్యకారుల జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్య రఫ్ లుక్ లో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వీడియో చివరిలో నాగచైతన్య సాయి పల్లవి గురించి చెప్పే డైలాగ్ హైలైట్ అనే చెప్పాలి.
బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే.. కాస్తా నవ్వవే.. అంటూ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా నాగచైతన్య ఓ క్రేజీ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో మరోసారి నాగ చైతన్య. బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే.. కాస్తా నవ్వవే అంటూ వాలెంటైన్స్ డే విషెష్ చెప్పాడు. ఈ వీడియోలో సాయి పల్లవి కూడా కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తండేల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ పై అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
నాగ చైతన్య, సాయి పల్లవి వీడియో..
View this post on Instagram
సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.