హైదరాబాద్‌లో అనిరుధ్ తొలి లైవ్ కాన్సర్ట్.. ఒక్కో టికెట్ కోసం ఐదుగురు పోటీ..!

రాక్ స్టార్ అనిరుధ్ సంగీతం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీలో రాక్ స్టార్ అనిరుద్. తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించారు అనిరుద్ . హైదరాబాద్‌లో అనిరుధ్ రవిచందర్ కాన్సర్ట్‌ నిర్వహించనున్నారు .

హైదరాబాద్‌లో అనిరుధ్ తొలి లైవ్ కాన్సర్ట్.. ఒక్కో టికెట్ కోసం ఐదుగురు పోటీ..!
Anirudh

Edited By:

Updated on: Feb 18, 2026 | 8:17 PM

హైదరాబాద్‌లో అనిరుధ్ రవిచందర్ కాన్సర్ట్‌పై భారీ హైప్ నెలకొంది. తొలిసారి హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ ఇవ్వబోతుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 15 ఏళ్ల తన సంగీత ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసేందుకు అనిరుధ్ “XV Tour” పేరుతో ఈ షో నిర్వహిస్తున్నారు. ఈ కాన్సర్ట్ మార్చి 21, 2026న గచ్చిబౌలి అవుట్‌డోర్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఈ షోకు టికెట్ల కోసం రికార్డు స్థాయిలో డిమాండ్ వచ్చింది. మొత్తం స్టేడియంలో 30 వేల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటే, టికెట్ల కోసం 1.5 లక్షలకుపైగా రిక్వెస్టులు వచ్చాయి. అంటే ఒక్క టికెట్ కోసం ఐదుగురు పోటీ పడుతున్నారు.

టికెట్లు రెండు దశల్లో అమ్ముతారు. ముందుగా ప్రీ-రిజిస్ట్రేషన్ చేసిన వాళ్లకు మాత్రమే టికెట్లు కొనుగోలు చేసే అవకాశం ఇస్తారు. ఈ ప్రీ-సేల్ ఫిబ్రవరి 19, 2026 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 20 ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత అందరికీ ఓపెన్‌గా టికెట్లు అమ్మే జనరల్ సేల్ ఫిబ్రవరి 20 మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. అయితే ప్రీ-సేల్‌లోనే ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయే అవకాశం ఉండడంతో జనరల్ సేల్‌లో టికెట్లు దొరకడం కష్టమవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ కాన్సర్ట్‌లో అనిరుధ్ తన 15 ఏళ్ల కెరీర్‌లోని పాపులర్ పాటలను లైవ్‌లో పాడనున్నారు. వై దిస్ కొలవరి వంటి వైరల్ హిట్ నుంచి, పవన్ కల్యాణ్ గాలి వాలుగా ఓ గులాబి వాలి లాంటి క్లాసిక్ పాటల వరకు అన్నీ ఉండనున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంత పెద్ద స్థాయిలో అనిరుధ్ షో జరగడం ఇదే తొలిసారి కావడంతో, ఈ ఈవెంట్ నగరంలో బిగ్గెస్ట్ మ్యూజికల్ షోలలో ఒకటిగా నిలవొచ్చని అంచనా వేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us