Actress Hema: హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ చర్యలు..! అదే జరిగితే

బెంగళూరు రేవ్‌పార్టీ ప్రకంపనలు టాలీవుడ్‌ని ఊపేస్తున్నాయి. మూడొందల సినిమాల్లో నటించిన హేమ... తన అనుభవాన్నంతా పదిహేను క్షణాల వీడియోలో రంగరించి.. నెట్లో వదిలింది. ఆ ఒక్క వీడియో ఆమె కష్టాలను రెట్టింపు చేసింది. అటు పోలీసులు, ఇటు పరిశ్రమ ఆమెను వెంటాడుతున్నాయి. శిక్షాస్మృతుల్ని వల్లె వేస్తున్నాయి.

Actress Hema: హేమపై మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ చర్యలు..! అదే జరిగితే
Hema
Follow us

|

Updated on: May 23, 2024 | 9:42 AM

బెంగళూరు ఫామ్‌హౌస్‌లో హైప్రొఫైల్ రేవ్ పార్టీ.. అడ్డంగా దొరికిన అతికొద్దిమందిలో అదిగో ఆమె కూడా ఉంది.. అంటూ నటి హేమ ఫోటోలు రిలీజ్ చేసిన కన్నడ ఖాకీలు.. టాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపారు. ఆ తీగను వాళ్లు అలా లాగుతారని తెలీక.. ఈ మెరుపుతీగ ఇలా కవరింగ్ ఇచ్చుకున్నా ఫలితం లేకపోయింది.

నా ఇంట్లో నేనున్నా నన్ను అనవసరంగా లాక్కండి అని హీరో శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం తర్వాత డ్యాన్స్‌ యూనియన్ ప్రెసిడెంట్‌గా డ్యూటీలో ఇప్పుడే దిగా.. రేవ్‌ పార్టీలూ గట్రా నాకు తెలీదు అని జానీ మాస్టర్ ఫైరయ్యారు. నాకూ ఏ పాపముూ తెలీదు అని కంటతడి పెట్టిన యాంకర్ శ్యామలనూ వదిలేశారు. కానీ.. నటి హేమనైతే ఉపేక్షించేట్టు లేరు నెటిజన్లు. బెంగళూరు పోలీసులైతే కేసు పెట్టి మరీ వెంటాడుతున్నారు. ఎవరు వదిలినా వదలకపోయినా.. నేను మాత్రం వదల బొమ్మాళీ అంటూ సీన్లోకొచ్చేశారు టాలీవుడ్‌లో హేమ కొలీగ్ కరాటే కల్యాణి. అంతన్నావ్ ఇంతన్నావ్.. ఇప్పుడు నువ్వే గుంతలో పడ్డావ్ అంటూ కసిదీరా మాటలతో కాటేస్తోంది కరాటే మేడమ్.

హేమ అండ్ కరాటే కల్యాణి… టాలీవుడ్‌లో ఇద్దరికిద్దరూ ఫైర్‌బ్రాండ్లే.. ఒకరంటే ఒకరికి మంట. గతంలో మాటామాటా అనుకుని చూపరులకు మాంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన జంట. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో ఎదురెదురు నిలబడి.. ఒకర్నొకరు ఏకిపారేసుకున్న కలర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాకులు వీళ్లవి. ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ ఎదురుపడ్డారు.. పాత పగలు పెచ్చరిల్లి.. ప్రతీకార జ్వాలను రగిలించేలా ఉన్నారు. ఎందుకంటే ఈ పగ ఇప్పటిది కాదు. పేకాట ఆడి దొరికానని అప్పట్లో నన్ను బజారుకీడ్చింది.. ఇప్పుడు ఆమె అంతకంటే పెద్ద తప్పే చేసి నంగనాచిలా నాటకాలాడుతోంది.. అంటూ తనకు తానే గతాన్ని గుర్తు చేసుకుంటోంది కరాటే కల్యాణి. సో.. రేవ్‌పార్టీ సాకు మీద ఇద్దరి మధ్యా మళ్లీ చాకిరేవ్ షురూ ఐనట్టేనా?

నిజం నిప్పులాంటిది, బయటపడక తప్పదు.. డ్రగ్స్‌ తీసుకున్నట్టు రిపోర్టు వస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్న కళ్యాణి.. హేమకు అదే పనిగా కాపడం పెడుతున్నారు. యూట్యూబ్ చానెళ్ల గొట్టాలకిచ్చిన ఇంటర్వ్యూల్లో హేమాయణాన్ని కథలు కథలుగా చెబుతోంది కరాటే కల్యాణి. ఒక్క వీడియోతో జనాన్ని, పోలీసుల్ని, మీడియాను కంబైన్డ్‌గా తప్పుదారి పట్టించినందుకు రేపటిరోజున హేమ బహిరంగ క్షమాపణ చెబితే చెప్పొచ్చు గాక. కానీ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున హేమకు శిక్ష తప్పదని చెబుతోంది మా జాయింట్ సెక్రటరీ హోదాలో కరాటే కల్యాణి.

ఇలా రేవ్‌పార్టీలు, డ్రగ్‌ రాకెట్ల లాంటి ముతక సందర్భాల్లో తీగలాగితే టాలీవుడ్ డొంక మాత్రమే ఎందుకు కదులుతోంది? టాలీవుడ్ సెలబ్రిటీలు చిల్ అవడానికి.. గలీజు దారుల్లో వెళుతున్నారా? ఇటీవల అనేక సందర్భాల్లో మాదకద్రవ్యం అనగానే ఆ పక్కనే నవదీప్ పేరు టక్కున వినిపిస్తోంది. ఇప్పుడీ రేవ్ పార్టీలో హేమ అంటూ తాజా ఉదంతం. ఇలా.. ఒకరిద్దరు చేసే ఓవరాక్షన్ల వల్ల.. కళంకం మాత్రం పరిశ్రమ మొత్తానికీ అంటుకుంటోంది. అందుకే.. అడ్డదారి తొక్కినవాళ్లు ఎవరైనా సరే ఆడ, మగ తేడా లేకుండా.. కఠిన శిక్షలు పడాల్సిన అవసరమైతే ఉంది. కోలీవుడ్‌లో ఐతే ఇటువంటి సందర్భాల్లో నటీనటుల సంఘం నుంచి పీకిపారేస్తారు.. ఏళ్ల తరబడి సినిమాల్లో నటించకుండా బహిష్కరిస్తారు. అలా దండన గట్టిగా ఉంటే తప్ప.. దారికి రారు అనే సలహాలు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్