Chiranjeevi: చిరంజీవి ఏ స్థాయికి ఎదిగినా, తన పాత స్నేహితులను మర్చిపోలేదు.. చాలా గొప్ప వ్యక్తి

మెగా స్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఇటీవలే మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. తాజాగా దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి ఒక భారీ ప్రాజెక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Chiranjeevi: చిరంజీవి ఏ స్థాయికి ఎదిగినా, తన పాత స్నేహితులను మర్చిపోలేదు.. చాలా గొప్ప వ్యక్తి
Chiranjeevi

Updated on: Nov 14, 2026 | 8:52 PM

మెగాస్టార్ చిరంజీవి కేవలం నటుడిగానే కాకుండా మానవత్వం గల వ్యక్తిగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. ఈ విషయం సీనియర్ కో-డైరెక్టర్ కనగల జయకుమార్‌తో ఆయన అనుబంధం ద్వారా మరోసారి స్పష్టమైంది. ఓ ఇంటర్వ్యూలో జయకుమార్, చిరంజీవి ఎదుగుదల, ఆయనతో తన అనుబంధం గురించి పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ మెగాస్టార్ దృష్టికి వెళ్లడంతో, అనూహ్యంగా చిరంజీవి జయకుమార్‌కు వ్యక్తిగతంగా పిలుపునిచ్చారు. చిరంజీవి పిలుపుతో కనగల జయకుమార్ ఎంత ఆనందించారో ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. మేనేజర్ ద్వారా వచ్చిన ఫోన్ కాల్, చిరంజీవి తన వేర్‌అబౌట్స్ కనుక్కోమని చెప్పడం, షంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గర షూటింగ్ స్పాట్‌కు రావాలని కోరడం, ఇవన్నీ జయకుమార్‌కు నమ్మశక్యం కాని విధంగా అనిపించాయి. చిరంజీవి తరఫున కారు పంపించి, మర్యాదగా ఆహ్వానించిన తీరు మెగాస్టార్ నిరాడంబరతకు, విలువలకు అద్దం పట్టింది. షాట్ మధ్యలో కూడా జయకుమార్‌తో కూర్చుని మాట్లాడటం, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ఆయన గొప్పదనానికి నిదర్శనం అని అన్నారు.

దారుణంగా ఉన్నావ్ అని రిజెక్ట్ చేశాడు.. ఆ తర్వాత నన్ను హీరోగా పెట్టి సినిమా చేశాడు

చిరంజీవి తన కెరీర్ తొలి రోజులు పునాది రాళ్ళు, ప్రాణం ఖరీదు, పంచప్రాణాలు వంటి చిత్రాల గురించి, మద్రాసులో ఎదుర్కొన్న కష్టాలు, నిర్మాతలతో అనుభవాలను జయకుమార్‌తో పంచుకున్నారు. ఒక నిర్మాత నుంచి కేవలం ఐదు వేల రూపాయల కోసం ఎదురుచూసి, మరో నిర్మాత పది వేలు ఇచ్చి ప్రోత్సహించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. చిరంజీవి ఔదార్యం అక్కడితో ఆగలేదు. జయకుమార్ పాటలు రాస్తున్నానని చెప్పగానే ప్రోత్సహించి, భవిష్యత్తులో తప్పకుండా సహకరిస్తానని హామీ ఇచ్చారు. లంచ్ తర్వాత, చిరంజీవి ఆయనకు లక్ష రూపాయల నగదు బహుమతిని, అలాగే భగవద్గీత ఆడియో బుక్ ప్లేయర్‌ను బహుకరించారట. ఈ ప్లేయర్ తెలుగుతో పాటు పలు భాషలలో భగవద్గీతలోని సారాంశాన్ని అందిస్తుందని చిరంజీవి వివరించారు.

చేసింది రెండే రెండు సినిమాలు.. అందులో ఒకటి వెయ్యి కోట్లు.. ఇంకొకటి అట్టర్ ఫ్లాప్

రెండో రోజు చిరంజీవి నివాసంలో జరిగిన సమావేశం మరింత ఆత్మీయంగా సాగింది. చిరంజీవి చెన్నై కాఫీ గురించి మాట్లాడటం, సురేఖ మేడంకు కూడా దానిష్టమని చెప్పడం పాత రోజులను గుర్తుకు తెచ్చింది. జయకుమార్ తనపై రాసిన కవిత చిరు కానుకను చిరంజీవికి చదివి వినిపించినప్పుడు, చిరంజీవి కళ్ళు చెమర్చాయని, ఆయన కూడా భావోద్వేగానికి లోనయ్యారని జయకుమార్ తెలిపారు. కృషి ఒక కుడిభుజం, శ్రమ ఒక చైతన్యం, పట్టుదల ఒక పరాకాష్ట వంటి పదాలతో కూడిన ఆ కవిత మెగాస్టార్ కృషిని స్పష్టంగా వివరించిందట.  చిరంజీవి ఏ స్థాయికి ఎదిగినా, తన పాత స్నేహితులను, సహచరులను గుర్తుంచుకోవడం, వారికి తగిన గౌరవం ఇవ్వడం, అండగా నిలబడటం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం.

ఇవి కూడా చదవండి

అతని వల్లే జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది.. ఈ ఫీల్డ్‌లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు: నటి శ్రీవిద్య

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us