Chiranjeevi: “ఆ విషయంలో అనసూయ నా పైన అలిగింది”.. మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు

|

Oct 04, 2022 | 3:17 PM

మెగాస్టార్ చిరంజీవి  మూవీ గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న ఈ సినిమా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తోంది.

Chiranjeevi: ఆ విషయంలో అనసూయ నా పైన అలిగింది.. మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు
Chiranjeevi New Movie
Follow us on

మెగాస్టార్ చిరంజీవి  మూవీ గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న ఈ సినిమా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా నటిస్తోన్నారు. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా నుంచిఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

తాజాగా మరోసారి మీడియాతో ముచ్చటించారు చిరంజీవి. ఈ ప్రెస్ మీట్ లో గాడ్ ఫాదర్ టీమ్ హాజరయ్యారు. తాజాగా మెగాస్టార్ మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. గాడ్ ఫాదర్ సినిమా చేయడానికి అసలు కారణం ఏంటో చెప్పారు చిరంజీవి. కొత్తదనం చేయాలనీ అనుకుంటూ ఉంటాను. కొత్తగా ప్రయత్నించాలి, ఎప్పుడు ఫైట్స్, సాంగ్స్ ఇదే కాదు ఎదో కొత్తగా చేయాలనీ అని నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. దాన్ని చరణ్ కనిపెట్టాడు. ఒకరోజు నా దగ్గరకు వచ్చి లూసీఫర్ సినిమా చూశారా అని అడిగాడు. మంచి సినిమా చూశాను .. చాలా బాగా తెరకెక్కించారు అని అన్నాను. అయితే ఆ సినిమా రీమేక్ హక్కులను తీసుకుంటాను అన్నాడు నేను ఓకే అన్నాను.

ఆ టైం లో నేను వెత్యాసంగా చేయాలని అనుకుంటున్న నాకు ఈ సినిమా కరెక్ట్ అనిపించింది. అయితే లూసీఫర్ సినిమా చూశాను కానీ నాకు సంతృప్తిగా అనిపించలేదు. తెలుగు వర్షన్ కూడా చూశా కానీ నాకు తృప్తి కలగలేదు. దాంతో నేను ఈ సినిమా చేయాలనీ అనుకున్నా. అదే సమయంలో నాకు ఈ కథలో చిన్న చిన్న మార్పులు చేసి సాకు సంతృప్తి కలిగేలా, నా ఇమేజ్ కు తగ్గట్టుగా  ఎవరు చేస్తారు అనుకుంటున్నా సమయంలో.. చరణ్ మోహన్ రాజా పేరు చెప్పారు అని తెలిపారు మెగాస్టార్. ఇక ఈ సినిమా చూస్తున్నంత వరకు హీరోయిన్ లేదేంటి.. పాటలు లేవేంటి అని అనిపించదు. అంతా రూపొందించారు మోహన్ రాజా. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకంగా నాకు ఉంది అని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. అలాగే ప్రీరిలీజ్ ఈవెంట్ లో అందరి పేర్లు చెప్పడం కుదరలేదు.  అందులో అంశాడుట పేరు కూడా ఉంది. దాంతో ఆమె నా పైన అలిగింది కూడా అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..