Megastar Chiranjeevi: చిరంజీవి చెప్పిన జీవిత సత్యం.. అవమానాన్ని రివేంజ్‏గా కాదు.. కసిగా మార్చుకోవాలి..

కానీ ఇటీవల జరగిన ఓ కార్యక్రమంలో తొలిసారి తనకు జరిగిన ఓ అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. ఇటీవల తెలుగు మీడియా నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న చిరు తన సినీ ప్రయాణంలో ఎదురైన సంఘటనలు, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో మాట్లాడుతూ అవమానాన్ని రివెంజ్‏గా కాకుండా కసిగా మార్చుకుని ఎదగాలని అన్నారు. చిరు మాట్లాడుతూ..

Megastar Chiranjeevi: చిరంజీవి చెప్పిన జీవిత సత్యం.. అవమానాన్ని రివేంజ్‏గా కాదు.. కసిగా మార్చుకోవాలి..
Megastar Chiranjeevi
Follow us

|

Updated on: Apr 04, 2024 | 8:31 PM

మెగాస్టార్ చిరంజీవి.. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమను ఏలుతున్న రారాజు.. నటనపై ఆసక్తి.. ఎలాగైనా సినిమాల్లో కనిపించాలనే తపనతో చెన్నై చేరుకున్న సామాన్య యువకుడు ఇప్పుడు తెలుగు కళామతల్లికి గర్వకారణమయ్యాడు. మాములు మధ్య తరగతి కుటుంబానికి చెందిన కొణిదెల శివశంకర వరప్రసాద్.. నేడు టాలీవుడ్ ఇండస్ట్రీకి చిరంజీవి అయ్యాడు. ఎంతో మందికి స్పూర్తిగా మారిన చిరు సినీ ప్రయాణం అంత సులభమేమి కాదు. ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. మొదట సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి ఆ తర్వాత హీరోగా ఎదిగారు. అప్పటివరకు మూసధోరణితో ఉన్న చిత్రపరిశ్రమలో తనదైన నటన.. యాక్షన్ సీక్వెన్స్.. డాన్స్‏తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. అప్పట్లో చిరు సినిమా వచ్చిందంటే థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యేవి. తన తర్వాత వచ్చిన తరానికి అండగా నిలబడ్డాడు. నటుడిగా తన సినీ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొన్నానని ఎప్పుడూ బయటపెట్టలేదు.. కానీ ఇటీవల జరగిన ఓ కార్యక్రమంలో తొలిసారి తనకు జరిగిన ఓ అవమానాన్ని గుర్తుచేసుకున్నారు.

ఇటీవల తెలుగు మీడియా నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న చిరు తన సినీ ప్రయాణంలో ఎదురైన సంఘటనలు, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో మాట్లాడుతూ అవమానాన్ని రివెంజ్‏గా కాకుండా కసిగా మార్చుకుని ఎదగాలని అన్నారు. చిరు మాట్లాడుతూ.. “న్యాయం కావాలి సినిమా జరుగుతున్న సమయంలో తాను బయట ఉన్నాను.. అప్పటికే ఓవైపు సీనియర్ నటి శారద, మరోవైపు కొంగ జగ్గయ్య, రాధిక నిలబడి ఉన్నారు. అక్కడే పైన క్రేన్ లో ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ ఉన్నారు. అందరూ రెడీగా ఉన్నారు. అప్పుడు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పిలవడంతో వెళ్లాను. దాదాపు 300 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఏంటండీ.. మీరేమైనా సూపర్ స్టార్లు అనుకుంటున్నారా.. ఇక్కడే ఉండొచ్చు కదా.. మిమ్మల్ని మళ్లీ ఒకరు పిలవాలా ? అంటూ అందరి ముందు నాపై అరిచాడు. ఆ మాటలు వినేసరికి ఒక్కసారిగా గుండె పిండేసినట్లు అయ్యింది. అందరి ముందు ఇలా అరిచాడేంటీ అనిపించింది. ఆరోజు భోజనం కూడా చేయలేదు. కానీ సాయంత్రం నాకు ఫోన్ చేసి.. శారద ఎక్కువ టేక్స్ తీసుకుంటుందని కోపం వచ్చి నాపై అరిచానని చెప్పాడు. కానీ ఆయన కోపం నామీద అరిస్తే నేను డిప్రెషన్ అయ్యాను.. ఎంతగా కుంగిపోయాను. ఆయన అరిచిన మాటలు కాకుండా మీరేమైన సూపర్ స్టార్లు అనుకుంటున్నారా ? అనే మాట నా మైండ్ లో ఉండిపోయింది. ఆ ఒక్క మాట మదిలో ఉండిపోయింది. ఆ సమయానికి బాధపడినా.. సూపర్ స్టార్ అయి చూపిస్తాను అనుకున్నాను.

ఆ సమయానికి ఆయన మీద రివేంజ్ తీర్చుకోలేదు.. ఆ అవమానాన్ని కసిగా మార్చుకుని నా ఎదుగుదలకు మెట్లుగా మార్చుకున్నాను. నా అవమానాన్ని అనుకూలంగా మార్చుకున్నాను. నాపై ఎవరు ఎన్ని మాటలు అన్నా.. అవాక్కులు చవాక్కులు పేలిన నవ్వుతూ చూస్తుంటాను. ఎందుకంటే ఎన్నో అవమానాలు ఎదుర్కోని ఇక్కడి వరకు వచ్చాను అనిపిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరు చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. మనల్ని ఎవరెన్ని రకాలుగా అవమానించినా వారిపై రివేంజ్ కాకుండా అందులో కూడా సానుకూల విషయాన్ని గ్రహించి ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని అని చిరు చెప్పిన జీవిత సత్యం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.