Megastar Chiranjeevi: గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడో తెలుసా..

|

Sep 26, 2022 | 8:22 PM

ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Megastar Chiranjeevi: గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడో తెలుసా..
God Father
Follow us on

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉంది చిత్రయూనిట్. మలయాళీ సూపర్ హిట్ లూసిఫర్ చిత్రానికి తెలుగు రీమేక్‏గా రూపొందుతున్న ఈ మూవీలో సల్మాన్ ఖాన్, నయనతార కీలకపాత్రలలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 28న సాయంత్రం అనంతపురంలో జరగనుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. మలయాళీ సూపర్ హిట్ లూసీఫర్ చిత్రం కాకుండా తెలుగు ప్రేక్షకుల నెటివిటీకి తగినట్టుగా గాడ్ ఫాదర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో సత్యదేవ్, మురళీ మోహన్ నటిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతోపాటు హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు. మరోవైపు గాడ్ ఫాదర్ రిలీజ్ రోజునే అక్కినేని నాగార్జున నటిస్తోన్న ది ఘోస్ట్ చిత్రం కూడా థియేటర్లలోకి రాబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.