GodFather: బాస్ ఈజ్ బ్యాక్.. 100కోట్ల మార్క్ రీచ్ అయిన మెగాస్టార్ “గాడ్ ఫాదర్”

|

Oct 09, 2022 | 7:54 PM

దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించి అలరించారు.

GodFather: బాస్ ఈజ్ బ్యాక్.. 100కోట్ల మార్క్ రీచ్ అయిన మెగాస్టార్ గాడ్ ఫాదర్
Godfather
Follow us on

ప్రస్తుతం ఎక్కడ చూసిన గాడ్ ఫాదర్ హడావిడే కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించి అలరించారు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నయనతార నటించి అలరించారు. ఇక ఈ సినిమాలో సత్య దేవ్ , సునీల్ , సముద్రఖని, అనసూయ ఇతర ముఖ్యపాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ సినిమా తర్వాత.. సైరా నరసింహారెడ్డి, ఆచార్య సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి.

ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టారు మెగాస్టార్. ఇక గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకుంది. నిజానికి ఒరిజినల్ కంటే ఈ సినిమా బాగుందని టాక్ వినిపిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 50 కోట్లు మార్క్ చేరిన గాడ్ ఫాదర్.. ఇప్పుడు 100కోట్ల మార్క్ ను అందుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మేకర్స్. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు మెగా అభిమానులు.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా క్లైమాక్స్‏లో చిరు, సల్మాన్ వచ్చే స్క్రీన్ అదిరిపోయిందంటున్నారు. ఇందులో మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సైతం కీలకపాత్రలో కనిపించారు. తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకులను కూడా ‘గాడ్ ఫాదర్’ ఆకట్టుకోవడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమానే కాకుండా ప్రస్తుతం చిరు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి