‘భ‌లే’ కాంబో మ‌ళ్లీ రిపీట్ !

నాని.. నేచుర‌ల్ స్టార్ అని ఫ్రూవ్ చేసిన సినిమా 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్'. ఆ సినిమా ముందు నానీ కెరీర్ ఓ లెక్క..ఆ సినిమా త‌ర్వాత ఓ లెక్క‌. అంత‌కుముందు వ‌ర‌కు నాని మార్కెట్ రూ. 10 కోట్ల లోపులోనే ఉండేది.

'భ‌లే' కాంబో మ‌ళ్లీ రిపీట్ !

నాని.. నేచుర‌ల్ స్టార్ అని ఫ్రూవ్ చేసిన సినిమా ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’. ఆ సినిమా ముందు నానీ కెరీర్ ఓ లెక్క..ఆ సినిమా త‌ర్వాత ఓ లెక్క‌. అంత‌కుముందు వ‌ర‌కు నాని మార్కెట్ రూ. 10 కోట్ల లోపులోనే ఉండేది. కానీ ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’ మూవీ ఏకంగా రూ.50 కోట్ల మేర గ్రాస్ క‌లెక్ట్ చేసి సంచ‌ల‌న విజయం సాధించింది. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడు మారుతి కెరీర్ ను కూడా పూర్తిగా మార్చేసింది. అంత‌కుముందు అత‌డి కెరీర్లో హిట్లున్నా అడ‌ల్డ్ చిత్రాలు తీస్తాడ‌నే పేరుండేది. కానీ ఈ చిత్రంతో క్లీన్ ఎంట‌ర్టైన్మెంట్ అందించి..ఫ్యామిలీ ఆడియెన్స్ మెప్పు చూర‌గొన్నాడు.

‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’ సినిమా త‌ర్వాత నాని, మారుతిలు దూసుకుపోయారు. వారి మార్కెట్ లెవ‌ల్ పెంచుకుంటూ ఎదిగారు. చివ‌ర‌గా నాని ‘గ్యాంగ్ లీడ‌ర్’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వ‌చ్చాడు. ప్ర‌స్తుతం ‘వి’ చిత్రం విడుద‌లకు రెడీగా ఉంది. దీని త‌ర్వాత‌ ‘ట‌క్ జ‌గ‌దీష్’‌, ‘సింగ రాయ్’ సినిమాలు వ‌ర‌స‌లో ఉన్నాయి. మారుతి త‌ర్వాతి చిత్రం సంగ‌తి ఇంకా ఫైన‌ల్ అవ్వ‌లేదు. ఐతే అత‌ను ఓ స్క్రిప్టు రెడీ చేపి నానికి వినిపించాడ‌ని టాక్ న‌డుస్తోంది. నాని కూడా క‌థ నచ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. వ‌చ్చే ఏడాది వీరి కాంబినేష‌న్లో కొత్త చిత్రం ప‌ట్టాలెక్క‌బోతోంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్-2 బేన‌ర్ మీదే బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించే అవ‌కాశాలున్నాయంటున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశ‌ముంది. నాని-మారుతి క‌ల‌యిక‌లో అంటే మ‌రోసారి పక్కా వినోదాన్ని ఆశిస్తారు ప్రేక్ష‌కులు. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Click on your DTH Provider to Add TV9 Telugu