Manchu Manoj: మౌనిక పుట్టిన రోజు స్పెషల్.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్

మంచు మనోజ్, మౌనికలది ప్రేమ వివాహం. 2023 మార్చి 3న వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. ఇక 2024 ఏప్రిల్ లో ఒక పండంటి ఆడ బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారీ లవ్లీ కపుల్

Manchu Manoj: మౌనిక పుట్టిన రోజు స్పెషల్.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్
Manchu Manoj Family

Updated on: Oct 04, 2026 | 5:02 PM

తన భార్య మౌనిక భూమా మంచు పుట్టినరోజు సందర్భంగా నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తన జీవితంలో అత్యంత కష్టమైన సమయాల్లోనూ, తిరిగి నిలబడే ప్రయాణంలోనూ మౌనిక అందించిన అండ, నమ్మకం తనకు ఎంతో బలాన్ని ఇచ్చాయని భావోద్వేగంగా పేర్కొన్నారు. నమస్తే వరల్డ్, AIKYA ధైర్య సేన సమితి ద్వారా సమాజ సేవలో మౌనిక చేస్తున్న కృషిని అభినందిస్తూ, ఆమె కలలు సాకారం కావాలని ఆకాంక్షించారు. తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా AIKYAను ప్రారంభించామని, ఈ ఆలోచన వెనుక ఉన్న అసలైన హృదయం మౌనికేనని తెలిపారు. తమ కుటుంబం, కలిసి నిర్మించుకున్న అందమైన జీవితానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆమె ఎప్పటికీ తనకు ఎంతో ప్రత్యేకమని, ఆమె కలలకు కుటుంబమంతా అండగా ఉంటుందని పేర్కొంటూ ప్రేమపూర్వక సందేశాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం మంచు మనోజ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మౌనికకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. రీఎంట్రీలో అదరగొడుతున్నాడు మనోజ్. భైరవం సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన ఈ రాక్ స్టార్ మిరాయ్ సినిమాలో విలన్ గా అదరగొట్టాడు. ‘ది బ్లాక్ స్వోర్డ్’ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇదే పాత్రకు గానూ ప్రతిష్ఠాత్మక ‘సైమా అవార్డ్స్ 2026’లో ఉత్తమ విలన్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి విలన్ గా కనిపించేందుకు రెడీ అయ్యాడు మనోజ్. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న దాదా చిత్రంలో మరోసారి పవన్ ఫుల్ విలన్ గా కనిపించనున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా దాదా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు సోలో హీరోగా వడ్డీ కాసుల వాడు అనే సినిమా చేస్తున్నాడు మనోజ్.

ఇవి కూడా చదవండి

మంచు మనోజ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us