మంచు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు ఇండస్ట్రీతోపాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొన్నాళ్లుగా ఇంట్లో గుట్టుగా సాగిన గొడవలు కాస్తా ఇప్పుడు రచ్చకెక్కాయి. అటు తండ్రి కొడుకులు ఒకరి పై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసు కేసుల వరకు వెళ్లారు. మరోవైపు గత మూడు రోజులుగా హైదరాబాద్ జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా నడుస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో టీవీ9 రిపోర్టర్ తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన అనంతరం మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారు. హైబీపీ ఉండడంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరోవైపు మంచు మోహన్ బాబు తనయులు మంచు మనోజ్, విష్ణులకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. కుటుంబ కలహాలు వివాదంగా మారి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన నేపథ్యంలో 126 బిఎన్ఎస్ ప్రకారం జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హోదాలో నోటీస్ ఇచ్చారు.
దీంతో అటు మంచు మనోజ్, మంచు విష్ణు వేర్వేరుగా బుధవారం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ముందు హాజరయ్యారు. ఇద్దరి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. కుటుంబ వివాదాలను శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని.. ఇరు వర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. మరోవైపు మోహన్ బాబు మరో రెండు రోజులు ఆసుపత్రిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి సోషల్ మీడియాలో వరుసగా ఆసక్తికర పోస్టులు చేస్తున్నారు.
ఎప్పుడూ నెట్టింట యాక్టివ్ గా ఉంటూ ఏదోక పోస్ట్ చేసే మంచు లక్ష్మి.. ఇప్పుడు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న క్రమంలో వరుసగా ఆసక్తికర పోస్టులు చేస్తున్నారు. తాజాగా ‘ఈ ప్రపంచంలో ఏదీ మనది కానప్పుడు ఏదో కోల్పోతావనే భయం నీకెందుకు’ అంటూ ఓ రచయిత రాసిన సందేశం ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. అలాగే తన ఇన్ స్టా స్టోరీలో.. ‘ఇక పై నా కోసం నేను ఏది కోరుకోవడం లేదు ఏదైనా ఆపడానికి సరైన కారణం ‘ మరో పోస్ట్ చేశారు. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి.
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) December 12, 2024
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.