స్టార్ హీరో కొడుక్కి ఊహించని షాక్ ఇచ్చిన సెక్యూరిటీ..తండ్రి సినిమా షూటింగ్ చూద్దామని వస్తే..

|

Dec 02, 2024 | 12:43 PM

మోహన్‌లాల్ దర్శకత్వం వహించిన బారోస్ సినిమా సెట్‌లో తన తండ్రిని కలవడానికి వచ్చిన ప్రణవ్‌ను సెక్యురిటీ ఆపివేసినట్లు అతను చెప్పాడు. స్పెయిన్‌లోని బరోస్ సెట్‌లో తన తండ్రి మోహన్‌లాల్‌ని కలవడానికి ప్రణవ్ ఉబర్‌లో వచ్చాడు.

స్టార్ హీరో కొడుక్కి ఊహించని షాక్ ఇచ్చిన సెక్యూరిటీ..తండ్రి సినిమా షూటింగ్ చూద్దామని వస్తే..
Mohanlal
Follow us on

సెలబ్రిటీ జీవితానికి దూరంగా ఉండాలనుకునే వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు ప్రణవ్ మోహన్‌లాల్. కొన్ని సినిమాల్లోనే నటించినా మలయాళ సినీ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకోగలిగాడు ఈ యంగ్ హీరో. సెలబ్రెటీల కాకుండా సామాన్యుడిగా ఉండాలని ప్రణవ్ ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. ప్రణవ్ ప్రతి సినిమా తర్వాత చాలా విరామం తీసుకుంటాడు. ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటాడు ప్రణవ్. అతను సోషల్ మీడియాలో పంచుకునే చిత్రాల ద్వారా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. మోహన్‌లాల్, సుచిత్రా మోహన్‌లాల్ ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు కూడా..

అప్పట్లో అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే సన్యాసి..

ఇప్పుడు, నిర్మాత, నటుడు, దర్శకుడు అలెప్పీ అష్రాఫ్ తనకు ఎదురైన ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకున్నారు. మోహన్‌లాల్ దర్శకత్వం వహించిన బారోస్ సినిమా సెట్‌లో తన తండ్రిని కలవడానికి వచ్చిన ప్రణవ్‌ను సెక్యురిటీ ఆపివేసినట్లు అతను చెప్పాడు. స్పెయిన్‌లోని బరోస్ సెట్‌లో తన తండ్రి మోహన్‌లాల్‌ని కలవడానికి ప్రణవ్ ఉబర్‌లో వచ్చాడు. చాలా సామాన్యుడిగా అతను వచ్చాడు. సెక్యూరిటీ గార్డులు ప్రణవ్ ను ఆపి, షూటింగ్ లొకేషన్‌లోకి ఎవరినీ రానివ్వకూడదని మోహన్‌లాల్‌కి కట్టుదిట్టమైన ఆదేశాలు చేశారని ప్రణవ్ తో అన్నారని అలెప్పీ అష్రఫ్ వివరించారు.

16 ఏళ్లకే ఫేక్ వీడియోలు.. కట్ చేస్తే 18 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఎవరంటే..

“ఇందుకే సెక్యూరిటీ ప్రణవ్‌ను ఆపింది. ప్రణవ్ ఎవరో వారికి తెలియదు. సెక్యూరిటీ ప్రశ్నకుప్రణవ్ తన తండ్రిని చూడటానికి వచ్చానని సమాధానం ఇచ్చారు. అయితే అతను చెప్పింది వాళ్ళు నమ్మలేదు. లోపలికి అనుమతించబోమని సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు. ప్రణవ్ వాళ్ళతో వాదించకుండా.. ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ నిలబడ్డాడు. కొంత సమయం తరువాత, సెక్యూరిటీకి అనుమానం వచ్చింది. ఒక కుర్రాడు తన తండ్రిని చూడటానికి వచ్చాడని షూటింగ్ బృందానికి  తెలిసింది.  అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ ,  డైరెక్టర్ అనీష్ వెళ్లి చూడగా చూడగా అది ప్రణవ్. ప్రణవ్ ఎవరో తెలియగానే సెక్యూరిటీ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారని అష్రఫ్ తెలిపారు. మోహన్‌లాల్ కొడుకు అనే అహంకారాన్ని ప్రణవ్ ఎప్పుడూ ప్రయత్నించలేదని, ప్రణవ్ ఇంట్లో లగ్జరీ కార్ల కలెక్షన్ ఉన్నప్పటికీ, అతను బస్సు, రైలులో ప్రయాణిస్తాడని అష్రాఫ్ చెప్పారు. రైలులో ప్రయాణిస్తున్నట్లయితే, స్లీపర్, జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కువగా ప్రయాణిస్తాడని అష్రాఫ్ చెప్పుకొచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..