AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌కు వెళ్లాలనుకుంటున్నారా? మహేష్ చెప్పిన సూచనలు వినండి.. వీడియో

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ యాక్షన్ అడ్వెంచర్ సినిమా తెరకెక్కుతోంది. గ్లోబ్ ట్రాటర్ (వర్కింగ్ టైటిల్) పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది.

Mahesh Babu: గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌కు వెళ్లాలనుకుంటున్నారా? మహేష్ చెప్పిన సూచనలు వినండి.. వీడియో
SSMB 29 Globetrotter Event
Basha Shek
|

Updated on: Nov 14, 2025 | 6:14 PM

Share

మహేశ్-రాజమౌళి సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్ర, ప్రియాంక చోప్రా మందాకిని రోల్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. వీటికి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక శనివారం (నవంబరు 15) సాయంత్రం ఈ క్రేజీ ప్రాజెక్టుకు ఓ భారీ ఈవెంట్ జరగనుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే ఈ వేడుక కోసం చిత్ర బృందంతో పాటు అతిరథ మహారథులు తరలిరానున్నారని తెలుస్తోంది. అలాగే అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని సమాచారం. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతోన్న వరుస ప్రమాదాల దృష్ట్యా భారీ బందోబస్తు మధ్య అత్యంత పకడ్బందీగా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ను నిర్వహించాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజమౌళి ఇప్పటికే ఓ వీడియోను రిలీజ్ చేశారు. అభిమానులకు తగిన సూచనలు చెప్పారు.

తాజాగా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కు సంబంధించి మహేష్ బాబు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈ ఈవెంట్ కు హాజరయ్యే అభిమానులకు కీలక సూచనలు జారీ చేశాడు. ‘గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ రోజున ఆర్ఎఫ్‌సీ మెయిన్ గేట్ మూసేసి ఉంటుంది. మీతో పాటు ఉన్న పాస్ స్కాన్ చేస్తే మీరు ఏ గేటు నుంచి రావాలో చూపిస్తుంది. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించండి. పోలీసులకు, సెక్యూరిటీ వాళ్లకు సహకరించండి. పోలీసులు మనకు చెప్పింది ఏంటంటే.. అందరూ ఎంత తక్కువ ట్రాన్స్‌పోర్టేషన్‌తో వస్తే అందరికీ అంత ఈజీగా ఉంటుంది. పాస్‌పోర్ట్ (ఈవెంట్ పాస్ ) లేకుండా కంగారుపడి వచ్చేయకండి. మనకు ఇలాంటివి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయి. రేపు సాయంత్రం కలుద్దాం’ అని మహేశ్ బాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మహేష్ బాబు రిలీజ్ చేసిన వీడియో..

ఈవెంట్ కోసం రెడీ అవుతోన్న రాజమౌళి, కీరవాణి, యాంకర్ సుమ..

కాగా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో మహేశ్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ బిగ్ ఈవెంట్ వెళ్లలేకపోతే జియో హాట్‌స్టార్ ఓటీటీలో లైవ్‌గా చూడొచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత