GunturKaaram: రెడీ అయిపోండి అబ్బాయిలు.. ‘గుంటూరు కారం’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

|

Jan 03, 2024 | 5:02 PM

మహేష్, గురూజీ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో సినిమా ఇది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాను భారీ లెవల్ లో విడుదల చేయనున్నారు. మహేష్ బాబును సరికొత్తగా చూపించనున్నారు గురూజీ. ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్ ఫ్యాన్ కు పూనకాలు తెప్పించాయి.

GunturKaaram: రెడీ అయిపోండి అబ్బాయిలు.. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
Gunturu Kaaram
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరుకారం. మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మహేష్, గురూజీ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో సినిమా ఇది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాను భారీ లెవల్ లో విడుదల చేయనున్నారు. మహేష్ బాబును సరికొత్తగా చూపించనున్నారు గురూజీ. ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్ ఫ్యాన్ కు పూనకాలు తెప్పించాయి. అలాగే రీసెంట్ గా వచ్చిన కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే ట్రెండింగ్ లో ఉంది. మహేష్ సినిమా నుంచి ఊహించని పోస్టర్స్, సాంగ్స్ తో సినిమా పై హైప్స్ ను భారీగా పెంచేస్తున్నారు మేకర్స్.

ఇదిలా ఉంటే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే గుంటూరు కారం ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. తాజాగా చిత్ర నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ పై హింట్ ఇచ్చారు. జనవరి 6న గుంటూరు కారం మూవీ ట్రైలర్ ను విడుదల చేస్తాం అని తెలిపారు.

దాంతో అభిమానుల్లో ఉత్సహం రెట్టింపైంది. మహేష్ బాబు మాస్ అవతార్ లో ఎలా అలరిస్తాడో చూడాలి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జోడిగా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

నిర్మత నాగవంశీ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..