Tollywood: తేనె కన్నా తీయనైన గొంతు.. 25వేలకు పైగా పాటలు పాడిన ఈ లెజెండరీ సింగర్ ఎవరో గుర్తు పట్టారా?

|

Jul 27, 2024 | 4:34 PM

. పై ఫొటోలో ఉన్నది ఒక లెజెండరీ సింగర్. 16 ఏళ్లకే పాడడం మొదలు పెట్టిన ఆమె తన మధురమైన గానంతో సంగీత ప్రియులను అలరించింది. కేరళలో పుట్టినప్పటికీ, మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, ఒరియా, బెంగాలీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడింది. గత 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో సుమారు 25 ఏళ్లకు పైగా పాటలు ఆలపించిన ఘనత ఆమె సొంతం.

Tollywood: తేనె కన్నా తీయనైన గొంతు.. 25వేలకు పైగా పాటలు పాడిన ఈ లెజెండరీ సింగర్ ఎవరో గుర్తు పట్టారా?
Legendary Singer
Follow us on

సాధారణంగా ఏ రంగంలోనైనా పురుషులదే ఆధిపత్యం. అందుకు సినిమా ఇండస్ట్రీ ఏమీ మినహాయింపు కాదు. అయితే గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి మారుతూ వచ్చింది. మగవారితో పాటు మగువలు ఇక్కడ సత్తా చాటుకున్నారు. ఒక్క నటన విషయంలోనే వివిధ విభాగాల్లోనూ తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది గాయనీ, గాయకులు ఉన్నారు. అయితే కొన్నాళ్ల క్రితం అలా కాదు. కొద్ది మంది గాయకులు మాత్రమే ఉండేవారు. ఇక అందులో ఆడవారి ప్రాతినిథ్యం చాలా తక్కువ. పై ఫొటోలో ఉన్నది ఒక లెజెండరీ సింగర్. 16 ఏళ్లకే పాడడం మొదలు పెట్టిన ఆమె తన మధురమైన గానంతో సంగీత ప్రియులను అలరించింది. కేరళలో పుట్టినప్పటికీ, మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, ఒరియా, బెంగాలీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడింది. గత 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో సుమారు 25 ఏళ్లకు పైగా పాటలు ఆలపించిన ఘనత ఆమె సొంతం. ఇక తన గాన ప్రతిభకు లెక్కలేనన్నీ అవార్డులు వచ్చాయి. తేనె కన్నా తీయనైన గొంతుతో సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ విశిష్టమైన స్థానాన్ని సొంతం చేసుకున్న ఈ సింగర్ మరెవో కాదు కేఎస్ చిత్ర. శనివారం (జులై 27) ఆమె పుట్టిన రోజు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ లెజెండరీ సింగర్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదే సందర్భంగా చిత్ర చిన్ననాటి, అరుదైన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.

 

గత 45 ఏళ్లుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఒరియా, బెంగాలీ భాషల్లో ఎన్నో పాటలు పాడారు కేఎస్ చిత్ర. ఇప్పటివరకు సుమారు 25 వేలకు పైగా పాటలకు తన తీయనైన గొంతుతో ప్రాణం పోసిందామె. ఇక తన గాన ప్రతిభకు గుర్తింపుగా ఆంధ్ర, తమిళనాడు, కేరళ, ఒడిశా, కర్ణాటక, బెంగాలీ స్టేట్ ఫిల్మ్ అవార్డులు వచ్చాయి. అలాగే ఆరు నేషనల్ అవార్డులు, తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కూడా ఈమె సొంతమయ్యాయి. ఎస్పీ బాలు, జేసుదాసు వంటి సంగీత దిగ్గజాల నుంచి ఇప్పటి తరం సింగర్స్‌తోనూ చిత్ర గాత్రాన్ని షేర్ చేసుకుంటున్నారీ లెజెండరీ సింగర్. కాగా కేఎస్ చిత్రని ముద్దుగా భారతీయ మెలోడీ క్వీన్ అని పిలుస్తారు
ఇప్పటికీ సినిమాల్లో పాటలు పాడుతూ, స్టేజీ షోల్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు కేఎస్ చిత్ర.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.