GOAT: విజయ్ గోట్ సినిమాలో ఏఐ టెక్నాలజీ విజయ్ కాంత్ సీన్స్.. ఎమోషనల్ అవుతోన్న ఫ్యాన్స్

|

Sep 05, 2024 | 11:55 AM

విజయ్ ఈ మూవీలో డ్యూయల్ రోల్‌లో కనిపించారు. అలాగే విజయ్ యంగ్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. అలాగే ఏఐ టెక్నాలజీ ద్వారా దివంగత నటుడు విజయకాంత్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు ఈ సన్నివేశాలు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

GOAT: విజయ్ గోట్ సినిమాలో ఏఐ టెక్నాలజీ విజయ్ కాంత్ సీన్స్.. ఎమోషనల్ అవుతోన్న ఫ్యాన్స్
Vijayakanth
Follow us on

దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. విజయ్ ఈ మూవీలో డ్యూయల్ రోల్‌లో కనిపించారు. అలాగే విజయ్ యంగ్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. అలాగే ఏఐ టెక్నాలజీ ద్వారా దివంగత నటుడు విజయకాంత్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు ఈ సన్నివేశాలు ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్నాయి.  విజయకాంత్‌ని తమిళ సినిమాకే కాదు తమిళనాడుకే కెప్టెన్‌గా ముద్దుగా పిలుచుకుంటారు. సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రవిడ కజగం అనే పార్టీని స్థాపించి రాజకీయ రంగంలోనూ నాయకుడిగా ఎదిగారు. గత ఏడాది డిసెంబర్ 28న అనారోగ్య కారణాలతో విజయకాంత్ కన్నుమూశారు. అతని మరణం ఇప్పటికీ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆయన భౌతికకాయాన్ని ఖననం చేసిన కోయంబేడు దేముడిక కార్యాలయానికి ప్రతిరోజూ వేలాది మంది అభిమానులు వివిధ పట్టణాల నుంచి తరలివస్తుంటారు. విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో ఏఐ టెక్నాలజీ ద్వారా విజయకాంత్ కు సంబంధించిన సన్నివేశాలను రూపొందించారు. దీనికి సంబంధించి విజయకాంత్ కుటుంబం నుంచి అనుమతి తీసుకున్నారు చిత్రయూనిట్. కెప్టెన్ ప్రభాకరన్ సినిమాను విజయకాంత్ ఇమేజ్‌కి ఉదాహరణగా వాడుకున్నారు. విజయకాంత్‌ను మళ్లీ తెరపై చూడగానే అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ‘వి మిస్ యూ కెప్టెన్’ అంటూ చిత్రబృందం ఆయనకు నివాళులర్పించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

‘కెప్టెన్‌ని తెరపై చూసి చాలా ఏళ్లయింది.. మళ్లీ నాయకుడిని చూడాలని కెప్టెన్‌ అభిమానుల కళ్లు తహతహలాడుతున్నాయి.. మా కోరికను నెరవేర్చిన దళపతి విజయ్‌కి ధన్యవాదాలు.” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కెరీర్ బిగినింగ్ లో విజయ్ విజయ్ కాంత్ తో కలిసి నటించారు. ఆయన అంటే విజయ్ కి ఎప్పటికీ ప్రేమ ఉంటుంది. విజయకాంత్ భౌతికకాయాన్ని సందర్చించాడని విజయ్ హాజరయ్యారు. సినిమా పూర్తయిన తర్వాత విజయకాంత్ కుటుంబానికి విజయ్ సహా చిత్రబృందం వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలపడం గమనార్హం. ఇక ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వంవహించారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, యోగి బాబు, VTV గణేష్, వైభవ్, జయరామ్, ప్రేమ్జీ అమరన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి