
నందమూరి తారకరత్న అకాల మరణాన్ని అభిమానులు.. కుటుంబసభ్యులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతితో నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చివరివరకు తోడుండాల్సిన భర్త ఒంటరిని చేస్తూ వెళ్లిపోవడంతో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నారా లోకేష్ పాదయాత్ర సమయంలో జనవరి 27న గుండెపోటుకు గురైన తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృదలయ ఆసుపత్రిలో 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. ఆయన అంతిమసంస్కారాలను నందమూరి బాలకృష్ణ, ఎంపీ విజయసాయి రెడ్డి దగ్గరుండి చూసుకున్నారు. ఇటీవల తారకరత్న చిన్న కర్మ కూడా నిర్వహించారు.
మొదటి నుంచి తారకరత్న కుటుంబానికి అండగా ఉంటున్నారు బాలకృష్ణ. అలాగే పిల్లల బాధ్యతను కూడా తానే తీసుకుంటానని వెల్లడించారు తాజాగా తారకరత్న పెద్ద కర్మ తేదీని కూడా ప్రకటించారు ఆయన కుటుంబసబ్యులు. ఎంపీ విజయసాయి రెడ్డి, బాలకృష్ణ అంత్యక్రియలు, చిన్న కర్మ దగ్గరుండి చూసుకున్నారు బాలకృష్ణ, విజయసాయి రెడ్డి. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎంపి విజయసాయిరెడ్డికి దగ్గరి బంధువు కావడంతో ఆయన దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నారు.
తారకరత్న పెద్దకర్మకు సంబంధించిన కార్డును సోషల్ మీడియాలో షేర్ చేశారు. తారకరత్న కుటుంబసబ్యులు కార్డును ప్రింట్ చేయించారు. మార్చి 2న మధ్యాహ్నం 12 గంటల నుంచి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో తారకరత్న పెద్ద కర్మ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్డుపై నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య, వారి పిల్లలు నిషిక, తనయ్ రామ్, రేయ పేర్లను ప్రచురించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.