చరణ్‌ సినిమా కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్..! మెగా పవర్‌‌స్టార్ సినిమాలో స్టార్ హీరోయిన్?

టాలీవుడ్ హిట్‌గా నిలిచిన ‘రంగస్థలం’ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ఆర్‌సీ17’ (RC17). ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్లకముందే టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్ కోసం సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్‌ను ఎంపిక చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో రూమర్లు జోరందుకున్నాయి.

చరణ్‌ సినిమా కోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్..! మెగా పవర్‌‌స్టార్ సినిమాలో స్టార్ హీరోయిన్?
Ram Charan And Sukumar

Updated on: Jul 18, 2026 | 10:06 PM

రామ్ చరణ్ ఇటీవల నటించిన పెద్ది సినిమా భారీ వసూళ్లతో సక్సెస్ అందుకుంది. దీంతో సుకుమార్ డైరెక్షన్‌లో రానున్న చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలో కథను మలుపు తిప్పే ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం చిత్ర యూనిట్ స్టార్ హీరోయిన్‌ను సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి.

భారీ అంచనాలు

చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. గతంలో టాలీవుడ్‌ను షేక్ చేసిన ‘రంగస్థలం’ కాంబో రామ్ చరణ్, సుకుమార్ మళ్లీ కలిసి సినిమా చేస్తున్న ‘ఆర్‌సీ17’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ సినిమాల్లోని క్యారెక్టరైజేషన్లు ఎంత బలంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం హీరో హీరోయిన్ల క్యారెక్టర్లకే పరిమితం కాకుండా, కథను నడిపించే ఇతర పాత్రలను కూడా ఎంతో పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతారు. ఇప్పుడు ‘ఆర్‌సీ17’ విషయంలోనూ అదే మేజిక్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు.

పవర్‌‌ఫుల్‌ రోల్‌లో..

ప్రస్తుతం సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఒక కీలకమైన, కథను మలుపు తిప్పే పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను ఎంపిక చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇందులో ఆమె సాధారణ పాత్రలో కాకుండా, విలక్షణమైన శైలితో పవర్‌ఫుల్ రోల్‌లో మెరవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు, దర్శకుడు సుకుమార్ చివరి మార్పుల కోసం అమెరికా వెళ్లినట్లు ఇండస్ట్రీ టాక్. కథలో నయనతార పాత్ర చిత్రణ అద్భుతంగా కుదిరిందని, అందుకే ఆమె అయితేనే ఆ క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం జరుగుతుందని చిత్ర బృందం భావిస్తోందట.

Ram Charan And Nayanthara

మెగాస్టార్ తర్వాత..

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సరసన నటించి భారీ విజయాన్ని అందుకున్న నయనతార, ఇప్పుడు కొడుకు రామ్ చరణ్ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమా రేంజ్ పాన్-ఇండియా స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. నయనతార కేవలం గ్లామర్ పాత్రల వైపు మొగ్గు చూపరు. కథలో ప్రాధాన్యత ఉండి, తన నటనకు స్కోప్ ఉంటేనే ప్రాజెక్టులకు ఓకే చెప్తారు.

ఆ రకంగా చూస్తే సుకుమార్ రాసుకున్న ఈ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌కు ఆమె కచ్చితంగా సరిపోతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ క్రేజీ అప్‌డేట్‌పై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రానున్నాయి.

Follow Us