నన్ను ఐరెన్ లెగ్ అంటున్నారు.. నెగిటివ్ ట్రోల్స్‌పై యంగ్ హీరోయిన్ ఎమోష్ననల్ కామెంట్స్

హీరోయిన్స్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ రావడం మనం చూస్తూనే ఉంటారు. హీరోయిన్స్ చిన్న మిస్టేక్ చేసినా సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటారు. తాజాగా ఓ హీరోయిన్ తనపై నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారని ఎమోషనల్ అయ్యింది.

నన్ను ఐరెన్ లెగ్ అంటున్నారు.. నెగిటివ్ ట్రోల్స్‌పై యంగ్ హీరోయిన్ ఎమోష్ననల్ కామెంట్స్
Actress

Updated on: Apr 10, 2026 | 10:30 AM

సినిమాల్లో హీరోయిన్ గా రాణించడం అంత ఈజీ కాదు. ఒక్కసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆఫర్స్ అందుకోవడం పెద్ద టాస్క్.. ఆఫర్స్ వచ్చినా సక్సెస్ లు అందుకోవడం మరో టాస్క్. కొంతమంది హీరోయిన్స్ అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. మరికొంతమంది వరుసగా అవకాశాలు అందుకుంటున్నా హిట్స్ లేక సతమతం అవుతున్నారు. అయితే వరుసగా హిట్స్ కొడితే లక్కీ హీరోయిన్, గోల్డెన్ లెగ్ అంటూ ట్యాగ్ లు ఇచ్చేస్తుంటారు. అలాగే ఫ్లాపులు అందుకుంటే బ్యాడ్ లక్ బ్యూటీ, ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ లు ఇస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ పై కూడా ఇలాంటి ట్యాగ్ లపై అసహనం వ్యక్తం చేసింది. ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ ఇవ్వడం పై ఎమోషనల్ అయ్యింది ఆ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

తెలుగులో తక్కువ సమయంలో పాపులర్ అయిన హీరోయిన్స్ లో కృతిశెట్టి ఒకరు. ఈ అందాల భామ తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. తొలి సినిమాలోనే తన నటనతో అందరిని ఆకట్టుకుంది ఈ చిన్నది. అలాగే తన అందంతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది. ఆతర్వాత వరుసగా బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో హిట్స్ అందుకుంది. కానీ ఆతర్వాతే సీన్ రివర్స్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

ఆతర్వాత కృతిశెట్టి నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో కృతి మలయాళం, తమిళ్ ఇండస్ట్రీల వైపు అడుగులేసింది. మలయాళంలో ఓ హిట్ అందుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రదీప్ రంగనాథ్ తో కలిసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నెగటివ్‌ ట్రోల్స్‌ చేసేవారు నెగటివ్‌గా థింక్‌ చేస్తుంటారు. ఈ ఆలోచనా ధోరణి వాళ్ల జీవితాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. పాజిటివ్‌ థింకింగ్‌ చాలా ముఖ్యం. ఈ మధ్య అందరూ అన్నీ ఇన్సూరెన్స్‌ చేయిస్తున్నారు. ఏమో… భవిష్యత్‌లో లవ్‌ను ఇన్సూరెన్స్‌ చేసే ఛాన్స్ ఉంటే, అలా చేస్తారేమో.. నాకైతే పాత కాలపు ప్రేమలంటేనే ఇష్టం. ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా యాక్టింగ్‌పైనే ఉంది. ఐదేళ్ల తర్వాతో, పదేళ్ల తర్వాతో… ఒక వ్యక్తితో డేటింగ్‌ చేసి, ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది.

ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us