
సీనియర్ నటుడు, రెబెల్ స్టార్ కృష్ణంరాజు మరణానని ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం, తోటి నటీనటుల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో రియల్ లైఫ్‌లో రొమాంటిక్ ఆ కాదా అని అడిగినప్పుడు, తాను స్నేహితులను ఎంతగానో ప్రేమించే వ్యక్తిగా చెప్పారు. సినిమాల్లో కనిపించినంత సీరియస్‌గా బయట ఉండనని అన్నారు కృష్ణం రాజు. అలాగే తొలి రోజుల్లో తనకు లవ్ లెటర్స్ చాలా వచ్చేవని, అయితే అమరదీపం సినిమా తర్వాత పరిస్థితి మారిపోయిందని కృష్ణంరాజు గారు గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా తర్వాత తాను చాలా మంది అమ్మాయిలకు అన్నయ్య అయిపోయానని, వందల కొద్దీ ఉత్తరాలు అన్నయ్య అనే వచ్చేవని తెలిపారు. కొందరు తమ అన్నయ్యలు తనలాగే ఉంటారని, మరికొందరు తమకు అన్నయ్య లేరని, తననే అన్నయ్యగా భావిస్తున్నామని రాశేవారని వివరించారు.
అలాగే తన మొదటి చిత్రం కృష్ణకుమారిలో ఐదు, ఆరేళ్లు పెద్దవారైన కృష్ణకుమారి గారితో రొమాంటిక్‌గా నటించినట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో ఆయన నటించిన తీరు చాలా చక్కగా వచ్చిందని వివరించారు. ఈ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు గారిని బాగా ఇంప్రెస్ చేసిన హీరోయిన్ ఎవరు అనే కీలక ప్రశ్నకు నిస్సందేహంగా వాణిశ్రీ పేరు చెప్పారు. ముఖ్యంగా తన సొంత సినిమా అయిన కృష్ణవేణిలో వాణిశ్రీ చేసిన పెర్ఫార్మెన్స్ అన్ ఇమాజినబుల్ అని ప్రశంసించారు. తాను హీరోగా, వాణిశ్రీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఆమె నటనకు అప్పట్లో జాతీయ అవార్డులు ఉండి ఉంటే ఖచ్చితంగా రావాల్సినవని అభిప్రాయపడ్డారు. ఆ పాత్రలో వాణిశ్రీ ఎంతగా లీనమైపోయారంటే, సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా కొంతకాలం ఆ పాత్ర తాలూకు ప్రభావంలోనే ఉండేవారని వివరించారు. ఆమె ఏకాగ్రత, పాత్ర పట్ల అంకితభావం అసాధారణమైనవని అన్నారు.
భక్త కన్నప్ప సినిమాలో కూడా వాణిశ్రీ అద్భుతంగా నటించారని కృష్ణంరాజు గారు గుర్తుచేసుకున్నారు. డైరెక్టర్ ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఆమె డైలాగులు, ఎక్స్‌ప్రెషన్స్‌తో తన నటనను ప్రదర్శించారని మెచ్చుకున్నారు. సావిత్రి గారు అంటే తనకు వ్యక్తిగతంగా అభిమానమని, ఒక ఫ్యాన్‌గా ఆమెను గౌరవిస్తానని చెప్పిన కృష్ణంరాజు గారు, నటిగా వాణిశ్రీ అంకితభావం, ఆమె ప్రదర్శన పట్ల తన ప్రత్యేక గౌరవాన్ని వెల్లడించారు. ఆ తర్వాత జయసుధ నటనను కూడా ఆయన అభినందించారు.
Krishnamraju, Vanisri
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.