24 ఏళ్లకే ఆత్మహత్య.. సూర్య కరుప్పు సినిమాలో నటించిన ప్రియ వదన మృతి

కోలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న ఓ యంగ్ యాక్ట్రస్, ప్రముఖ టీవీ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న ప్రియ వదన (24) ఆకస్మిక మరణం తమిళ మీడియా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అక్టోబర్ 21న ఆమె మృతి చెందినట్లు తెలుస్తుంది.

24 ఏళ్లకే ఆత్మహత్య.. సూర్య కరుప్పు సినిమాలో నటించిన ప్రియ వదన మృతి
Priyavadhana

Updated on: Oct 24, 2026 | 9:26 AM

కోలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న ఓ యంగ్ యాక్ట్రస్, ప్రముఖ టీవీ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న ప్రియ వదన (24) ఆకస్మిక మరణం తమిళ మీడియా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అక్టోబర్ 21న ఆమె మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రియ వదన తమిళనాడులోని ప్రముఖ టెలివిజన్ ఛానల్‌లో న్యూస్ రీడర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందు మరో టీవీ ఛానల్‌లోనూ పనిచేసిన ఆమెకు జర్నలిజంపై ఆసక్తి ఉండేది. బుల్లితెరపై తన కెరీర్‌ను కొనసాగిస్తూనే సినిమాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రయత్నించింది.

ఇటీవల సూర్య కథానాయకుడిగా నటించిన ‘కరుప్పు’ చిత్రంలో ఆమె చిన్న పాత్రలో కనిపించింది. దీంతో నటిగా కూడా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రియ వదన భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అందుకుంటుందని అందరూ అనుకున్నారు కానీ ఇంతలో విషాదం చోటు చేసుకుంది. ప్రియ వదన ఇటీవలే తన 24వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ క్రమంలో ఆమె ఆకస్మిక మరణవార్త  అందరినీ కలచివేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా  ఉండే ఆమె తన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకునేది.

ఇవి కూడా చదవండి

అయితే ప్రియ వదన మృతికి సంబంధించిన వార్తలు తమిళ మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని మీడియా కథనాల్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నప్పటికీ, ఈ ఘటనకు దారితీసిన కారణాలపై అధికారికంగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చిన్న వయసులోనే మీడియా రంగంలో పనిచేస్తూ, నటిగా ఎదగాలని ప్రయత్నించిన ప్రియ వదన అకాల మరణం పలువురిని విషాదంలో ముంచింది. ఆమె కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు సహోద్యోగులు సంతాపం తెలియజేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us