ఇండస్ట్రీలో ఈ ఏడాది చాలామంది జంటలు విడాకులు తీసుకున్నారు. మరికొన్ని ప్రేమకథలు బ్రేకప్ ప్రకటించాయి. సినీ పరిశ్రమనే కాకుండా బుల్లితెరపై సైతం ప్రేమ, బ్రేకప్ కామన్ అయ్యాయి. బుల్లితెరపై అనేక సీరియల్స్, టీవీ షోల ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. అలాగే సీరియల్లో జంటగా నటించిన నటీనటులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. స్మాల్ స్క్రీన్ పై జోడిగా అలరించిన ఆ ఇద్దరు రియల్ లైఫ్ లోనూ జంటగా మారాలని కోరుకుంటారు ఫ్యాన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దకాలంగా స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతుంది. అనేక సీరియల్స్ ద్వారా తనకంటూ ప్రత్యేక ప్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఓ స్టార్ హీరోతో ఏడేళ్లు ప్రేమాయణం నడిపింది. కానీ చివరకు ఓ మిలియనీర్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే టీవీ నటి అంఖిత లోఖండే. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ హిందీ బుల్లితెరపై చాలా ఫేమస్.
దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేయసి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. బుల్లితెర పరిశ్రమలో తన అందం, నటనతో అతి తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అంఖిత. పవిత్ర రిష్తా సీరియల్ ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. ఇందులో దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించాడు. ఈ సీరియల్ ద్వారా వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. కొన్నేళ్లపాటు వీరిద్దరు డేటింగ్ చేశారు. కానీ సుశాంత్ హీరోగా మారిన తర్వాత అనుహ్యంగా వీరిద్దరు విడిపోయారు. వీరిద్దరు దాదాపు 7 ఏళ్లు ప్రేమలో ఉన్నారు.
అంకిత 2021లో మిలియనీర్ వ్యాపారవేత్త విక్కీ జైన్‌ని పెళ్లాడింది. వీరికి ముంబైలో కోట్ల విలువైన భవనం ఉంది. అంకితాకు రూ. 30 కోట్లు, విక్కీ జైన్‌కు దాదాపు రూ. 100 కోట్ల ఆస్తులున్నాయని సమాచారం. 2005లో ముంబైకి వచ్చిన అంఖిత నటిగా అవకాశాలు అందుకోవడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కెరీర్‌ను కొనసాగించేందుకు ముంబైకి వచ్చినప్పుడు మొదట్లో రూ.75-100 మాత్రమే సంపాదించానని చెప్పుకొచ్చింది.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.