సిద్ధార్థ్, అదితి పెళ్ళిలో బిగ్ ట్విస్ట్.. ఆ గుడిలోనే ఎందుకు చేసుకున్నారో తెలుసా..

గత కొంతకాలంగా ఈ ఇద్దరూ ప్రేమలో విహరిస్తున్నారు. సిద్ధార్థ్, అదితి కలిసి మహాసముద్రం అనే సినిమా చేశారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అప్పటి నుంచి ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే సిద్ధార్థ్ కు గతంలోనే పెళ్లి జరిగింది. మేఘన అనే యువతిని సిద్ధార్థ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

సిద్ధార్థ్, అదితి పెళ్ళిలో బిగ్ ట్విస్ట్.. ఆ గుడిలోనే ఎందుకు చేసుకున్నారో తెలుసా..
Siddharth, Aditi Rao
Follow us

|

Updated on: Mar 28, 2024 | 3:26 PM

సిద్ధార్థ్, అదితి పెళ్లి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఉన్నట్టుండి ఈ ఇద్దరూ పెళ్లి చేసుకొని అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ ప్రేమలో విహరిస్తున్నారు. సిద్ధార్థ్, అదితి కలిసి మహాసముద్రం అనే సినిమా చేశారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అప్పటి నుంచి ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే సిద్ధార్థ్ కు గతంలోనే పెళ్లి జరిగింది. మేఘన అనే యువతిని సిద్ధార్థ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కొడుకు కూడా ఉన్నాడు. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సిద్దార్థ్ ఒకరిద్దరు హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపాడు. ఇక ఇప్పుడు అదితిని పెళ్లి చేసుకున్నాడు. అదితి  కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం.

ఈ జంట మార్చి 27న తెలంగాణలోని వనపర్తిలో రంగనాయకస్వామి ఆలయంలో సడన్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు ఇప్పటి వరకు తమ పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా సిద్ధార్థ్, అదితి పెళ్లి గురించి ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. సినిమా షూటింగ్ కోసం వెళ్తున్నాం అని చెప్పి ఈ ఇద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారట.

అయితే ఈ ఇద్దరూ తెలంగాణ ప్రాంతంలోని వనపర్తి లోనే ఎందుకు వివాహం చేసుకున్నారో తెలుసా..? అదితి రావు హైదరి తల్లి ‘విద్యారావు’  వనపర్తి సంస్థాన చివరి రాజు అయిన జే రామేశ్వర రావు కూతురు . ఈ వారసత్వంతోనే అదితి సిద్దార్థ్ పెళ్లి ఆ వంశీకులు కట్టించిన ఆలయంలో చేసుకున్నారట. ఈ పెళ్ళికి తమిళనాడు నుంచి పురోహితులు హాజరయ్యారట. అలాగే  వివాహానికి జే రామేశ్వర రావు వారసులు జే కృష్ణదేవర రావు కుటుంబం హాజరయ్యిందని తెలుస్తోంది.

 సిద్దార్థ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

 అదితి రావు హైదరి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.