పై ఫొటోలో ఉన్నది ఓ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. పైగా మన తెలుగమ్మాయి. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ అందాల తార ఆ తర్వాత వెండితెరకు పరిచయమైంది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తన అందం, అభినయంతో మంచి మార్కులే కొట్టేసింది. కెరీర్ ప్రారంభంలో వరుసగా విజయాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత వరుసగా పరాజయాలు పలకరించాయి. దీంతో సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ఎంచెక్కా రాజకీయాల్లో చేరింది. అదే క్రమంలో లాయర్ కోర్సు కూడా పూర్తి చేసింది. ఇప్పుడు ఎంచెక్కా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో లాయర్ గా విధులు నిర్వహిస్తోంది. ఇంతకు ఈ లేడీ వకీల్ సాబ్ ఎవరో తెలుసా? ఈరోజుల్లో సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రేష్మ రాథోడ్. తెలంగాణలోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చెందిన ఆమె వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో చదువుకుంది. ఇదే క్రమంలో 2012లో వెంకటేశ్-త్రిష జంటగా నటించిన ‘బాడీగార్డ్’ సినిమాలో హీరోయిన్‌కి ఫ్రెండ్‌గా నటించి మెప్పించింది. అదే ఏడాది మారుతి దర్శకత్వంలో ‘ఈ రోజుల్లో’ అనే యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రేష్మ అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
హీరోయిన్ గా తొలి మూవీతోనే సూపర్ సక్సెస్ అందుకున్న రేష్మ ఉదయ్ కిరణ్ తో కలిసి జై శ్రీరామ్ అనే సినిమాలో నటించింది. ఇది పెద్దగా ఆడలేదు. అలాగే లవ్ సైకిల్, ప్రతిఘటన, జీలకర్ర బెల్లం, అప్పవుమ్ వీంజుమ్(మలయాళ), అదగపట్టత్తు మగజననంగలయ్(తమిళ) తదితర చిత్రాలు కూడా ఆడియెన్స్ ను నిరాశపర్చాయి. దీంతో 2017 తర్వాత యాక్టింగ్ కు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసిందీ అందాల తార.
సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి చేరిన రేష్మ బీజేపీ పార్టీలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో లాయర్ కోర్సు కూడా పూర్తి చేసింది. హీరోయిన్ గా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయినప్పటికీ లాయర్ గా రేష్మ తనదైన మార్క్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలో సుప్రీంకోర్టు లాయర్‌గా ఆమెకు పదోన్నతి లభించింది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ లేడీ వకీల్ సాబ్. తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.