సెలబ్రిటీలు ఏ పని చేసినా విమర్శించడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాదు వారి కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగుతున్నారు. ఇప్పుడు కన్నడ స్టార్ హీరో కూతురు శాన్విపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. కొందరు నెటిజన్లు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ, సుదీప్ కూతురిపై ఒక్కసారిగా నెటిజన్లు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఆమె ఏం తప్పు చేసింది? అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళదాం రండి. ఇటీవల జీ కన్నడ ‘సరిగమప’ షోలో స్టార్ హీరో కిచ్చా సుదీప్, ఆయన భార్య ప్రియ, కూతురు సాన్వి సందడి చేశారు ఈ సందర్భంగా సాన్వి తన తండ్రి కోసం ఓ పాటను రాగయుక్తంగా ఆలపించింది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. ఈ పాట తర్వాత సాన్వి పూర్తిగా ఆంగ్లంలో నే మాట్లాడింది. ‘ప్రతివర్ష’ అనే పదం తప్ప మరే కన్నడ పదం ఉపయోగించలేదు. ఇదే ఇప్పుడు సాన్వీపై ట్రోల్‌కి కారణమైంది.
కాగా కిచ్చా సుదీప్ ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్స్ ఇంగ్లిష్ మాట్లాడొద్దని, కన్నడ భాషలో మాట్లాడేందుకు ప్రయత్నించాలని తరచూ చెబుతుంటారాయన. అలాంటిది కన్నడ రియాల్టీ షోలో తమ అమ్మాయిని కన్నడలో ఎందుకు మాట్లాడించలేదంటూ సుదీప్ ను ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో కొందరు సుదీప్, శాన్వీకి సపోర్టుగా నిలుస్తున్నారు. సుదీప్ కూతురు సాన్వి ఇంగ్లిషులో మాట్లాడినా కన్నడ లోనే అద్భుతంగా పాడిందని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరి ఈ విషయంపై సుదీప్ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
ಏನ್ ವಿಪರ್ಯಾಸ ನೋಡಿ ಸುದೀಪ್ ಅವರು ಬೇರೆ ಅವರಿಗೆ kannad ಅಲ್ಲಾ Kannada ಅಂತ ಕಲಿಸಿ ಕೊಡ್ತಾರೆ ಅದ್ರೆ ತಮ್ಮ ಮಗಳಿಗೆ ಇನ್ನೂ ಕನ್ನಡ ಭಾಷೆ ಮಾತನಾಡೋಕ್ಕೆ ಬರಲ್ಲ 🫡.10min ಶೋ ನಲ್ಲಿ ಇದಾಳೆ ಬಟ್ ಒಂದು ಕನ್ನಡ ಪದ ಬಳಕೆ ಮಾಡಿಲ್ಲ ಬೇರೆಯವರಿಗೆ ಉಪದೇಶ ಮಾಡೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ ತಮ್ಮ ಮಗಳಿಗೆ ಹೇಳಿದ್ರೆ ಒಳ್ಳೇದು #DBoss𓃰 #DevilTheHero pic.twitter.com/R3EbePb4f3
— Praveen-57 (@DDEVIL57) January 5, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.