AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Udhayanidhi Stalin: అత్యంత అసభ్యంగా, నీచంగా మాట్లాడాడు.. త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.. ఖుష్బూ

టాలీవుడ్ హీరోయిన్ త్రిషను ఉద్దేశిస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన తీరుపై టీవీకే నేతలు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు ఉదయనిధి కామెంట్స్ పై రాజకీయ నాయకులు, సినీతారలు మండిపడుతున్నారు. రాజకీయ లబ్ది కోసం మహిళల గౌరవాన్ని బలి చేయడం సరికాదని సీనియర్ నటి ఖుష్బూ సుందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ ఖాతాలో సుధీర్ఘ నోట్ రాశారు.

Udhayanidhi Stalin: అత్యంత అసభ్యంగా, నీచంగా మాట్లాడాడు.. త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.. ఖుష్బూ
Kushboo, Trisha, Udayanidhi
Rajitha Chanti
|

Updated on: Aug 04, 2026 | 4:18 PM

Share

కోలీవుడ్ హీరో, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఇటీవల హీరోయిన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కావేరీ జలాల అంశం మీద తంజావురులో జరిగిన నిరసనలలో భాగంగా ఉదయనిధి మాట్లాడుతూ త్రిష గురించి పరొక్షంగా అసభ్య వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఉదయనిధిపై టీవీకే నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఉదయనిధి వ్యాఖ్యల పట్ల సినీతారలు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. తాజాగా సినీయర్ నటి ఖుష్బూ సైతం సోషల్ మీడియా ఖాతాలో ఘాటుగా స్పందించారు. త్రిషను అవమానించినందుకు ప్రతిపక్ష నాయకుడు ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

“ఉదయనిధి స్టాలిన్ ప్రసంగాన్ని విన్నాను. అది అత్యంత అసభ్యంగా, నీచంగా, తీవ్ర అవమానకరంగా ఉంది. ఆయన పుణికిపుచ్చుకోవాలని ఆశిస్తున్న రాజకీయ సంస్కృతికి ఇది అద్దం పడుతోంది. ఇటువంటి మనస్తత్వం ఉన్నవారు రాజకీయ పార్టీకి నాయకత్వం వహించాలని, భవిష్యత్తులో రాష్ట్రాన్ని పాలించాలని ఆశిస్తే… ఇక దేవుడే మనల్ని కాపాడాలి. మహిళలను దూషించడం, కించపరచడం , అవమానించడాన్ని ఒక రాజకీయ ప్రదర్శనగా భావించి, తమ అనుచరుల చప్పట్లు, ఈలలు, నవ్వుల మధ్య ఆనందించే వారి నుండి ఇంకేమి ఆశించగలం? దీని గురించి నాకంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? ఇటువంటి భాషను సాధారణ విషయంగా పరిగణించేవారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మహిళల గౌరవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం బలిపశువును చేస్తే, ఏ కుటుంబమూ (మీ కుటుంబంతో సహా) అటువంటి పరిస్థితి నుండి తప్పించుకోలేదు. రాజకీయ విభేదాలు ఏవైనప్పటికీ, బహిరంగ చర్చలకు ఒక హద్దు ఉండాలి. మహిళలను గౌరవించాలి తప్ప, మీ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఆడుకునే పావులుగా చూడకూడదు. మీ రాజకీయ ప్రత్యర్థి పనితీరు, దార్శనికత లేదా నాయకత్వ పటిమతో పోటీపడలేమని తెలిసినప్పుడు, వ్యక్తిగత దూషణలకు , అసభ్యతకు దిగడం అత్యంత సులభమైన మార్గంగా మారుతుంది. ఉదయనిధి స్టాలిన్ ఆయన తండ్రి స్టాలిన్ గత కొన్నేళ్లుగా అనేక వివాదాలను ఎదుర్కొన్నారు, కానీ అది ప్రజా జీవితానికి ప్రమాణంగా మారకూడదు. బహిరంగ వేదికపై త్రిషను అవమానించినందుకు గాను, ప్రతిపక్ష నాయకుడు ఆమెకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. తన తప్పును అంగీకరించి, క్షమాపణ చెప్పే ధైర్యం , సంస్కారం ఆయనకు ఉన్నాయో లేదో చూద్దాం” అంటూ ఖుష్బూ రాసుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

ఖుష్బూ ట్వీట్..

మరోవైపు సింగర్ చిన్మయి సైతం ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ పై మండిపడ్డారు. రాజకీయ వైరుధ్యాలతో ఏమాత్రం సంబంధం లేని మహిళలను లక్ష్యంగా చేసుకోవడం మాని, రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సింగర్ చిన్మయి ట్వీట్ చేశారు.

సింగర్ చిన్మయి ట్వీట్..

నివేదా పేతురాజ్ ట్వీట్..

ఎక్కువమంది చదివినవి :  K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!