Rishab Shetty: అమిత్‌షాను కలిసిన ‘కాంతారా’ హీరో రిషబ్ శెట్టి.. ఫొటోస్ వైరల్.. విషయమేమిటంటే?

ప్రముఖ కన్నడ సినీ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశాడు. తమ ఇద్దరి భేటీకి సంబంధించిన ఫొటోలను స్వయంగా రిషబ్ శెట్టి నే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్లుండి రిషబ్ అమిత్ షాతో సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది.

Rishab Shetty: అమిత్‌షాను కలిసిన కాంతారా హీరో రిషబ్ శెట్టి.. ఫొటోస్ వైరల్.. విషయమేమిటంటే?
Rishab Shetty, Amit Shah

Updated on: May 03, 2026 | 7:30 AM

కన్నడ సినిమా ఇంస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. శనివారం (మే03) ఢిల్లీ వెళ్లిన రిషబ్ అమిత్‌ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యాడు. అమిత్ షాతో తన భేటీకి సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు కాంతారా హీరో.. ‘గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసే అదృష్టం నాకు దక్కింది. ఆయన ‘కాంతార’, ‘కాంతార చాప్టర్ 1′ చిత్రాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసలు కురిపించారు.
అది నా జీవితంలో అత్యంత గుర్తుండిపోయే క్షణాలలో ఒకటి. అలాగే నా రాబోయే చిత్రాల గురించి అడిగారు. ఆయనకు మన చరిత్ర, సంస్కృతి, కళ, సినిమా నిర్మాణంపై లోతైన జ్ఞానం, అవగాహన ఉన్నాయి. ఈ విషయాలపై మేమిద్దరం చాలా సేపు చర్చించున్నాం. అమిత్ షాను కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు రిషబ్. ప్రస్తుతం వీరి భేటీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానలు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

కాగా 2023లో రిషబ్ శెట్టి ప్రధానమంత్రి మోదీని కూడా కలిశారు. మోదీ కర్ణాటకకు వచ్చినప్పుడు, యశ్, రిషబ్ శెట్టి ప్రత్యేకంగా ప్రధానిని కలిశారు. ఆ సమయంలో మోదీ పర్యటన గురించి నటుడు రిషబ్ శెట్టి ఇలా అన్నారు, ‘నేను ప్రధానమంత్రి మోదీని ఒక గొప్ప నాయకుడిగా భావిస్తాను. ఆయనను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కన్నడ చిత్ర పరిశ్రమ గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే కాంతారా సినిమాను ప్రత్యేకంగా ప్రశంసించారు’ అని అన్నారు. కాగా రిషబ్ శెట్టికి సినీ పరిశ్రమతోనే కాకుండా పలువురు రాజకీయ నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోరిషబ్ శెట్టి అమిత్ షాతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

అమిత్ షాతో రిషబ్ శెట్టి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us