సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కంగువ మూవీ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కొచ్చిలోని పనంపల్లి నగర్‌లోని ఓ ఫ్లాట్‌లో నిషాద్ యూసుఫ్ శవమై కనిపించాడు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అతడు శవమై కనిపించాడు. కాగా నిషాద్ యూసుఫ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. విషయం తెలుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. నిషాద్ స్వస్థలం హరిపాడు.
మలయాళంలో ఎన్నో సినిమాలకు ఎడిటర్ గా పని చేశాడు నిషాద్ యూసుఫ్. అలాగే సూర్య హీరోగా నటిస్తున్న కంగువ సినిమాకు కూడా నిషాద్ యూసుఫ్ ఎడిటర్ గా చేశారు. ఈ సినిమానే కాదు సూర్య హీరోగా నటిస్తున్న నెక్స్ట్ సినిమాకు కూడా నిషాద్ యూసుఫ్ నే ఎడిటర్ గా పని చేస్తున్నారు.
కాగా నిషాద్ యూసుఫ్ ది ఆత్మహత్యేనా..? అసలు అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి.? అన్నది తెలియాల్సి ఉంది. కాగా కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య, బాబీ డియోల్ తో నిషాద్ యూసుఫ్ దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తల్లుమల చిత్రానికి ఎడిటింగ్ చేసినందుకు గాను నిషాద్ ఉత్తమ ఎడిటర్‌గా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.