AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalpika Ganesh: మొన్న పబ్‌లో.. ఈసారి రిసార్ట్‌లో..! మరో వివాదంలో నటి కల్పిక గణేష్

కల్పిక గణేష్.. ఈ మధ్యకాలంలో ఈమె పేరు బాగానే వినిపిస్తుంది. సినిమాల్లో సహాయకపాత్రలతో పాపులర్ అయ్యింది కల్పిక గణేష్. సినిమాలతోనే కాదు వివాదాలతోనూ ఈ చిన్నది వార్తల్లో నిలిచింది. ఇటీవలే ఓ పబ్ లో రచ్చ చేసింది. పబ్ సిబ్బంది తన పై దాడి చేశారు అంటూ వార్తలకెక్కింది కల్పిక గణేష్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కల్పికా గణేశ్‌ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

Kalpika Ganesh: మొన్న పబ్‌లో.. ఈసారి రిసార్ట్‌లో..! మరో వివాదంలో నటి కల్పిక గణేష్
Kalpika Ganesh
Rajeev Rayala
|

Updated on: Jul 29, 2025 | 12:08 PM

Share

సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయింది నటి కల్పిక గణేష్. ఆరెంజ్, జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. హీరోకు సిస్టర్ గా, ఫ్రెండ్ గా, అక్కగా, వదినగా ఇలా పలు సపోర్టింగ్ రోల్స్ లో ఆకట్టుకుంది. తన క్యూట్ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అదే సమయంలో పలు వివాదాలతోనూ వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన ఓ ఫేమస్ కమెడియన్ పై సంచలన ఆరోపణలు చేసిందీ అందాల తార. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న ఈ అందాల తార తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది.

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

మొన్నామధ్య పబ్ లో గొడవ చేసింది కల్పిక గణేష్.. బర్త్ డే కేక్ విషయమై పబ్ సిబ్బంది, నటికి మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. చివరకు ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో నటి పై పబ్ సిబ్బంది పచ్చి బూతులతో రెచ్చిపోయింది కల్పిక గణేష్. అయితే పబ్ సిబ్బంది దాడి చేయడంపై సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పబ్ తీరును ఎండగడుతూ నటి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

తాజాగా మరోసారి హంగామా చేసింది కల్పిక.. హైదరాబాద్‌ సమీపంలోని మొయినాబాద్‌ – కనకమామిడి ప్రాంతంలో ఉన్న ఓ రిసార్ట్‌లో హంగామా సృష్టించింది కల్పిక. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్‌లో ఒంటరిగా రిసార్ట్‌కు వచ్చి, రిసెప్షన్‌లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా కల్పిక ప్రవర్తించిందని తెలుస్తుంది. ఒక్కసారిగా వచ్చి మెనూ కార్డును విసిరేయడం, రూమ్ కీస్‌ను మేనేజర్ ముఖంపై విసరడం, అలాగే అసభ్యంగా బూతులు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కల్పిక పై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

View this post on Instagram

A post shared by iamkalpika (@iamkalpika27)

కల్పిక గణేష్ ఇన్ స్టా..

View this post on Instagram

A post shared by iamkalpika (@iamkalpika27)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..