AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghavendra Rao: ఇలాంటి సినిమాకు అలాంటి హీరోనా అన్నారు.. కానీ మూవీ ఇండస్ట్రీని షేక్ చేసింది

భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసి, ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తన సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Raghavendra Rao: ఇలాంటి సినిమాకు అలాంటి హీరోనా అన్నారు.. కానీ మూవీ ఇండస్ట్రీని షేక్ చేసింది
K Raghavendra Rao
Rajeev Rayala
|

Updated on: Sep 12, 2026 | 4:17 PM

Share

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన అన్నమయ్య చిత్రం తెలుగు సినిమాకు ఒక అపురూప కానుక. ఈ సినిమా నిర్మాణం, నటీనటుల ఎంపిక, చిత్రీకరణకు సంబంధించిన విశేషాలను కె. రాఘవేంద్రరావు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ ప్రాజెక్టు తన వద్దకు రావడానికి ముందు ఆత్రేయ, జంధ్యాల, కె. విశ్వనాథ్, బాపు వంటి దిగ్గజాలు ప్రయత్నించారని, కానీ ఏవో కారణాల వల్ల సాధ్యపడలేదని ఆయన తెలిపారు. వెంకటేశ్వర స్వామి కోసమే ఈ సినిమా తన వద్దకు వచ్చిందని రాఘవేంద్రరావు అభిప్రాయపడ్డారు. రచయిత భారవి రాసిన అన్నమయ్య కథను రాఘవేంద్రరావు తెలుసుకున్నారు. ఈ కథ వినగానే భక్తి భావంతో కుర్చీలోంచి కింద కూర్చుని విన్నానని, ఆ వెంటనే పదివేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఈ కథను ఎవరూ తీయకుండా తనవద్ద పెట్టుకున్నానని ఆయన చెప్పారు. ఆ తర్వాత టీటీడీ బోర్డు సభ్యుడు, భక్తుడు అయిన దొరస్వామి రాజు ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకొచ్చారు. నాగార్జున ఈ సినిమాలోకి రావడంలో దొరస్వామి రాజు కీలక పాత్ర పోషించారు. నాగార్జున అప్పటికే గ్లామర్, కమర్షియల్ చిత్రాలతో స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. అయితే, అక్కినేని నాగేశ్వరరావు విప్రనారాయణ, తుకారాం, భక్త పోతన వంటి భక్తి చిత్రాలతో విజయవంతమైన వారసత్వం నాగార్జునకు ప్లస్ పాయింట్ అవుతుందని, అలాగే మీడియాలో వ్యక్తమవుతున్న సందేహాలను ఇది అధిగమిస్తుందని భావించారు.

B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్

అన్నమయ్య పాత్రకు నాగార్జునను ఎంపిక చేయడంపై మీడియాలో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. “గ్లామర్ బాయ్ నాగార్జున అన్నమయ్య ఏమిటి.? కమర్షియల్ చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు భక్తి చిత్రం ఏమిటి.? ఫైటింగ్ హీరో సుమన్ వెంకటేశ్వర స్వామి ఏమిటి.?” అంటూ ప్రశ్నలు సంధించారు. అయితే, చిత్ర నిర్మాణం పూర్తయ్యే వరకు మీడియా సమావేశాలు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు నాగార్జునకు కథ చెప్పినప్పుడు, ఇది కమర్షియల్ విజయం సాధిస్తుందో లేదో తెలియదు కానీ, అవార్డు మాత్రం తప్పకుండా వస్తుందని అంచనా వేశారు. అయితే, కథ విన్న నాగార్జున కళ్ళు ఎర్రబడి, “డైరెక్టర్ గారు, ఇది అవార్డు మాత్రమే కాదు, పెద్ద కమర్షియల్ హిట్ కూడా అవుతుంది” అని పూర్తి నమ్మకంతో చెప్పారట. నాగార్జున అంకితభావం, అద్భుతమైన నటన సినిమాకు ప్రాణం పోసింది.

అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

వెంకటేశ్వర స్వామి పాత్రకు సుమన్‌ను ఎంపిక చేయడం కూడా ఒక సాహసమే. సుమన్ ఈ పాత్రకు ఒప్పుకుంటాడని మొదట నమ్మలేకపోయారు. కమల్ హాసన్‌ను సంప్రదించాలని దొరస్వామి రాజు ఒకసారి అనుకున్నా, అది కుదరలేదు. నాగార్జున ఎంపికపై ఉన్న వివాదాన్ని అధిగమించడానికి, మరో బలమైన, కాంట్రవర్షియల్ కాస్టింగ్ ఉండాలని రాఘవేంద్రరావు భావించారు. సుమన్‌కు చెబితే, ఆయన ఆశ్చర్యపోయారు. అయితే, సుమన్ చాలా భక్తిభావంతో ఆ పాత్రను పోషించారు. రమ్యకృష్ణను కూడా దండలు, సూత్రధారుల వంటి కమర్షియల్ చిత్రాలతో బిజీగా ఉన్నప్పుడు, భక్తి పాత్రలో నటించేందుకు ఒప్పించడం కష్టమైంది. ఆ పాత్రకు ఆమె సరైన ఎంపిక అని రాఘవేంద్రరావు ఆమెను ఒప్పించారు. రెండో భార్య తిమ్మక్క పాత్రకు కస్తూరిని ఎంపిక చేశారు.

ఇవి కూడా చదవండి

నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో

చిత్రీకరణ సమయంలోనే యూనిట్‌లో భక్తిభావం వెల్లివిరిసింది. “కలగంటి కలగంటి” పాట చిత్రీకరణ సమయంలో బ్రహ్మానందం తన్మయత్వం చెంది, షాట్ పూర్తవగానే అందరూ కూర్చుని, గొప్ప అనుభూతి కలిగిందని చెప్పిన విషయాన్ని రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు. నాగార్జున కళ్ళలో ఉన్న పవర్, ఆయన అంకితభావం సినిమాకు మరింత బలాన్నిచ్చింది. నందమూరి తారక రామారావు అడవి రాముడుతో తన కమర్షియల్ జీవితానికి గురువుగా నిలిస్తే, అన్నమయ్య తనకు భక్తి చిత్రాల బాట వేసిందని రాఘవేంద్రరావు అన్నారు. ఈ సినిమా విజయం తర్వాతే నాగార్జునతో రామదాసు, శిరిడి సాయి, నమో వెంకటేశాయ వంటి భక్తి చిత్రాలను రూపొందించారు. అన్నమయ్య చిత్రం ఇటు రాఘవేంద్రరావుకు, అటు నాగార్జునకు కెరీర్‌లో ఒక గొప్ప మలుపుగా నిలిచిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us