డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ వసూళ్లు రాబట్టింది. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించగా.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మేకింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా జై హనుమాన్ కూడా రాబోతుందని గతంలోనే డైరెక్టర్ ప్రకటించడంతో సీక్వెల్ పై మరింత హైప్ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీపావళి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కనిపించనున్నారు. బుధవారం విడుదలైన లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
అందులో శ్రీరాముడి ప్రతిమని చేతపట్టుకుని భక్తిపూర్వకంగా తిలకిస్తున్న ఆంజనేయుడిగా రిషబ్ శెట్టి కనిపించారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇక నిన్న జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. తాజాగా దీపావళి పండగ సందర్భంగా ఈరోజు జై హనుమాన్ థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘చీకటి యుగంలో కూడా ఆయన విధేయత చెక్కుచెదరదు. ఆయన ప్రభువు శ్రీ రాముడికి ఇచ్చిన మాట కోసం’ అంటూ ‘జై హనుమాన్’ థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
దాశరథి అంటూ రాముడిని స్మరిస్తూ ఈ థీమ్ సాంగ్ సాగుతుంది. చివర్లో జై హనుమాన్ అంటూ ఓ శ్లోకం కూడా వినిపిస్తుంది. ఈ పాటకు ఓజస్ సంగీతాన్ని అందిస్తుండగా.. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించారు. సింగర్ రేవంత్ ఈ పాటను అద్భుతంగా ఆలపించాడు. తాజాగా విడుదలైన థీమ్ సాంగ్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది.
ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‌గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్ను ఇప్పుడు చూస్తే షాకే..
Tollywood: ఫోక్ సాంగ్‌తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్గా అదరగొట్టేసింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.