AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: ‘మల్లేశం’లో హీరోయిన్‌గా నన్నే తీసుకున్నారు.. కానీ చెప్పాపెట్టకుండా తీసేశారు.. జబర్దస్త్ నటి ఎమోషనల్

2019లో రిలీజైన మల్లేశం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు, పురస్కారాలు కూడా అందుకుంది. ఈ సినిమాలో ప్రియదర్శి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాలో తననే ముందుగా హీరోయిన్ గా తీసుకున్నారంటోంది జబర్దస్త్ నటి.

Jabardasth: 'మల్లేశం'లో హీరోయిన్‌గా నన్నే తీసుకున్నారు.. కానీ చెప్పాపెట్టకుండా తీసేశారు.. జబర్దస్త్ నటి ఎమోషనల్
Jabardasth Actress
Basha Shek
|

Updated on: Jun 16, 2026 | 7:07 PM

Share

ప్రియదర్శి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మల్లేశం’. చేనేత కళాకారుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు రాజ్ రాచకొండ. అంతేకాదు ఆయనే ఈ సినిమాను నిర్మించారు కూడా. 2019లో రిలీజైన ఈ రియల్ స్టోరీ సంచలన విజయం సాధంచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అలాగే విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా అందుకుంది. ఈ సినిమా టైటిల్ రోల్ లో ప్రియదర్శి చక్కగా నటించారు. అలాగే అతని భార్య పద్మ పాత్రలో తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా ఒదిగిపోయింది. ఇలా ఇద్దరికీ చాలా మంచి పేరు తీసుకొచ్చింది మల్లేశం సినిమా. అయితే ఈ సూపర్ హిట్ మూవీలో హీరోయిన్ గా అనన్య నాగళ్ల ఫస్ట్ ఛాయిస్ కాదట. ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ జోర్దార్ సుజాతను తీసుకున్నారట మేకర్స్. అయితే ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా ఆమె ప్లేస్ లోకి అనన్య వచ్చిందట. మరి సుజాతను ఎందుకు తీసుకున్నారు? ఎందుకు తీసేశారు? అన్నది ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి.

సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో ప్రియదర్శికి భార్యగా నటించింది సుజాత. ఇప్పుడీ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది. దీని ప్రమోషన్లలో భాగంగానే మల్లేశం సినిమా ప్రస్తావన తీసుకొచ్చింది సుజాత. ‘నాకు సినిమాలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు.. సేవ్ ద టైగర్స్‌ కి కూడా అనుకోకుండానే వెళ్లాను. నా బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం చూసి వాళ్లకు నచ్చి నన్ను తీసుకున్నాను. అంతకు ముందు ప్రియ దర్శి హీరోగా నటించిన మల్లేశం సినిమాలో హీరోయిన్ అవకాశం కూడా నాకే వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ నాకు ఫోన్ చేసి ఈ పాత్ర నువ్వే చేయాలి అని అడిగారు. మొదట నేను చేయనని చెప్పేశా. నేను జర్నలిజంలోనే ఉన్నా.. అదే కెరియర్ అనుకున్నా.. మళ్లీ సినిమాలంటే డైవర్ట్ అవుతుంది.. చేయలేను అన్నాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు. నా ఇంట్లో నీ అంత బిడ్డ ఉంటే.. తనతోనే ఆ క్యారెక్టర్ చేయించేవారినంటూ ఆయన సెంటిమెంట్‌తో మాట్లాడటం నచ్చేసింది. నన్ను ఎవరైనా అక్కా చెల్లి అని అన్నారంటే అక్కడే మెల్ట్ అయిపోతా. అందుకే డైరెక్టర అలా అనేసరికి ఓకే అన్నాను. రెండు రోజుల్లో కాల్ చేస్తాం.. నీ క్యాస్ట్యూమ్స్ కూడా రెడీ చేస్తాం అని డైరెక్టర్ చెప్పారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఈ ప్రాజెక్టులోకి అనన్య నాగళ్ల వచ్చేసింది. వెంటనే నేను డైరెక్టర్ కు కాల్ చేశాను. అప్పుడు ఆయన ‘సారీ అమ్మా.. ఆల్రెడీ ఇంకో అమ్మాయిని తీసుకున్నాం’ అని సింపుల్ గా చెప్పేశారు. అప్పుడు నా హృదయం చాలా బాధపడింది. అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోయాను. అప్పటి నుంచి ఇంక సినిమాలకు ట్రై్ చేయలేదు. కానీ సేవ్ ది టైగర్స్ సినిమా వెంటపడి మరీ చేయించారు. లక్కీగా కలిసి వచ్చింది. పెళ్లి తరువాత కాస్త గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు చేయడానికి రెడీ ‘ అని అంటోంది సుజాత.

ఇవి కూడా చదవండి

సేవ్ ది టైగర్స్ సీజన్ 3 ప్రీమియర్స్ లో జోర్దార్ సుజాత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
'మల్లేశం'లో హీరోయిన్‌గా నన్నే తీసుకున్నారు.. కానీ: జబర్దస్త్ నటి
'మల్లేశం'లో హీరోయిన్‌గా నన్నే తీసుకున్నారు.. కానీ: జబర్దస్త్ నటి
కలవలేని ప్రేమకు.. భూమికి దిగని పక్షి.. ఆ సూపర్ హిట్ సాంగ్ అర్థం త
కలవలేని ప్రేమకు.. భూమికి దిగని పక్షి.. ఆ సూపర్ హిట్ సాంగ్ అర్థం త
40 ఏళ్లలోనూ 20ఏళ్ల వారిలా మెరిసిపోవాలా? కొరియన్ల సీక్రెట్స్ ఇవే!
40 ఏళ్లలోనూ 20ఏళ్ల వారిలా మెరిసిపోవాలా? కొరియన్ల సీక్రెట్స్ ఇవే!
భీమవరంలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భీమవరంలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
Multibagger Stock: లక్ష పెట్టుబడితో ఏకంగా రూ. 68 లక్షల లాభం..
Multibagger Stock: లక్ష పెట్టుబడితో ఏకంగా రూ. 68 లక్షల లాభం..
మగవారు అలర్ట్.. వేసవి లో ఈ తప్పులు చేస్తే.. ఆ శక్తికి ముప్పు..
మగవారు అలర్ట్.. వేసవి లో ఈ తప్పులు చేస్తే.. ఆ శక్తికి ముప్పు..
బంగారం Vs వెండి.. ప్రస్తుతం దేనిపై పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు
బంగారం Vs వెండి.. ప్రస్తుతం దేనిపై పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు
విజయశాంతి సరసన మొత్తం 19 సినిమాలు.. ఎన్ని బ్లాక్ బస్టర్స్..
విజయశాంతి సరసన మొత్తం 19 సినిమాలు.. ఎన్ని బ్లాక్ బస్టర్స్..
నా హృదయాన్ని హత్తుకున్న ఒక అందమైన సినిమా.. ఎన్టీఆర్ పోస్ట్ వైరల్
నా హృదయాన్ని హత్తుకున్న ఒక అందమైన సినిమా.. ఎన్టీఆర్ పోస్ట్ వైరల్
ఈ ఒక్క అలవాటు చాలు.. విజయానికి మీ ప్రయాణం మొదలైనట్టే!
ఈ ఒక్క అలవాటు చాలు.. విజయానికి మీ ప్రయాణం మొదలైనట్టే!