‘మా ఇంటి బంగారం’ సినిమాలో అదరగొట్టిన ఈ నటుడు ఎవరో తెలుసా? ఆ జబర్దస్త్ స్టార్ కమెడియన్‌కు ఏమవుతాడంటే?

సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ' మా ఇంటి బంగారం'. జూన్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. కాగా ఈ సినిమాలో సమంత చేతిలో చావు దెబ్బలు తిని ఓ నటుడు బాగా హైలైట్ అయ్యాడు. అతను ఎవరో తెలుసా?

మా ఇంటి బంగారం సినిమాలో అదరగొట్టిన ఈ నటుడు ఎవరో తెలుసా? ఆ జబర్దస్త్ స్టార్ కమెడియన్‌కు ఏమవుతాడంటే?
Maa Inti Bangaram Movie

Updated on: Jun 23, 2026 | 6:56 PM

జబర్దస్త్, ఓ బేబీ లాంటి సూపర్ హిట్స్ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ‘మా ఇంటి బంగారం’. గతంలో సామ్ తోనే జబర్దస్త్ , ఓ బేబీ లాంటి సూపర్ హిట్ జూన్ 19న రిలీజైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీ కలెక్షన్లు 2 మిలియన్ డాలర్స్ కు చేరువగా ఉన్నాయి. మొత్తానికి చాలా రోజులుగా మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తోన్న సమంతకు మా ఇంటి బంగారం సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కాగా ఈ సినిమాలో భారీ తారగణమే ఉంది. సమంతతో పాటు శ్రీనివాస గవిరెడ్డి, మంజూష, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మీ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. అయితే ఇదే సినిమాలో ఒక నటుడు బాగా హైలెట్ గా నిలిచాడు.

మా ఇంటి బంగారం సినిమా చూసిన వారికి ఈ నటుడు బాగా గుర్తుండి పోతాడు. సినిమాలో సమంత వెనకే ఫాలో అవుతూ తరచూ ఆమెతో తిట్టించుకుంటుంటాడీ యాక్టర్. ఇక చివర్లో అయితే ఇతను బాగా హైలెట్ అయ్యాడు. సమంతతో పెద్ద గరిటెతో కొట్టించుకోవడం, ఆమెతో ఫైట్ చేయడం, చివర్లో చనిపోవడం.. ఇలాంటి సీన్స్ తో బాగా హైలెట్ అయ్యాడీ యాక్టర్. సీరియస్ గా నటిస్తూనే నవ్వించి మా ఇంటి బంగారం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచిన ఈ నటుడు ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాడు. మరి ఇంతకీ ఈ యాక్టర్ ఎవరో తెలుసా?

ఇవి కూడా చదవండి

మా ఇంటి బంగారం సినిమాలో వంశీ..

ఇతని పేరు వంశీ. ఇతను మరెవరో కాదు జబర్దస్త్ స్టార్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ అన్నయ్య. గతంలో కొన్ని టీవీ షోల్లో కనిపించిన వంశీ ఇప్పుడు తన తొలి సినిమానే సమంత పక్కన యాక్ట్ చేశాడు. నెగెటివ్ షేడ్స్ పాత్రలో నటించి నవ్వించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో వంశీకి విలన్ గా, కమెడియన్ గా మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అయితే వంశీ దర్శకుడిగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం.

జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ లో వంశీ నండూరి..

Jabardasth Emmanuel Brother

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us