Jabardasth Praveen: ఫైమాతో కటీఫ్.. సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్.. అమ్మాయి ఎవరో తెలుసా?

పటాస్, జబర్దస్త్ తదితర టీవీషోలతో బాగా ఫేమస్ అయిన కమెడియన్ ప్రవీణ్ శుభవార్త చెప్పాడు. తన నటనతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించే ఇతను త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. తాజాగా ప్రవీణ్ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అతనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

Jabardasth Praveen: ఫైమాతో కటీఫ్.. సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్.. అమ్మాయి ఎవరో తెలుసా?
Jabardasth Praveen

Updated on: May 05, 2026 | 12:03 PM

జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ త్వరలోనే తన వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నాడు. తాజాగా అతని నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ప్రముఖ నటి, డ్యాన్సర్ కడెం వంశితతో కలిసి అతను ఉంగరాలు మార్చుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఈ నిశ్చితార్తం వేడుకకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా ప్రవీణ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. కాబోయే భార్యతో కలిసున్న ఫొటోలను షేర్ చేస్తూ.. ‘ నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ వంశిత’ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటోల్లో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఈ జంట, తమ క్యూట్ లుక్స్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ ఎంగేజ్మెంట్ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. టీవీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వీరి వివాహం జరగనుందని సమాచారం

కాగా పటాస్ షోతో బాగా ఫేమస్ అయ్యాడు ప్రవీణ్. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో మరింత క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తున్నాడీ కమెడియన్. ఇక వంశిత విషయానికి వస్తే.. ఈమె కూడా ఒక ప్రముఖ నటినే. డ్యాన్సర్‌గా కూడా టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ వంశితకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తన డ్యాన్స్ వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. ఇక ప్రవీణ్- వంశిత గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారని ఇప్పుడు దానిని వివాహ బంధంగా మార్చుకోనున్నారనని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ ప్రవీణ్ ఎంగేజ్మెంట్ వీడియో..

కాగా ప్రవీణ్ గతంలో ఫైమాతో ప్రేమలో ఉన్నాడని ప్రచారం జరిగింది. జబర్దస్త్ వేదికపై వీరిద్దరు కలిసి చేసిన స్కిట్స్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. దీంతో ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ వీరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్లు వచ్చాయి. అయితే ఏమైందో కానీ ఇద్దరూ విడిపోయారని తెలిసింది. ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో స్పందించిన ఫైమా, చిన్న చిన్న అపార్థాల వల్ల తాము విడిపోయామని పేర్కొంది. ‘ఇప్పుడు మేము బాగానే మాట్లాడుకుంటున్నాం. మా రిలేషన్‌ గురించి మాకు క్లారిటీ ఉంది’ అని చెప్పుకొచ్చింది.

కాబోయే భార్యతో జబర్దస్త్ ప్రవీణ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us