కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలిసే వరకు మనసు ఊరికే ఉండదు.. లోపలేదో తొలిచేస్తున్నట్లుంటుంది. జవాన్ విషయంలోనూ చాలా రోజులుగా అభిమానులకు అలాంటి అనుమానం ఒకటి ఉండిపోయింది. సినిమాలో విజయ్ ఉన్నారని కొందరు.. అలాంటిదేం లేదు అంతా ఉత్తిదే అని మరికొందరు చెప్తున్నారు. కానీ తాజాగా దీనికి ఆన్సర్ తెలిసిపోయింది. విజయ్‌పై ఉన్న పరదా తొలిగిపోయింది. ఐదేళ్ళ కింది వరకు విజయ్ గురించి.. ఆయన సినిమాల గురించి తెలుగులో పెద్దగా చర్చ జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఆయన మార్కెట్ రేంజ్ పెరిగింది. మన మీడియం రేంజ్ హీరోల స్థాయిలో విజయ్ సినిమాల బిజినెస్ జరుగుతుంది. అందుకే టాలీవుడ్‌లోనూ విజయ్ మ్యాటర్స్ ఇప్పుడు. తాజాగా జవాన్ సినిమాలో విజయ్ ఉన్నారా లేదా అనే సస్పెన్స్‌కు తెరపడింది. అందులో ఆయనున్నారనే క్లారిటీ వచ్చేసింది.
షారుక్ హీరోగా అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్న జవాన్ సినిమాపై సౌత్‌లోనూ అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా కింగ్ ఖాన్‌కు సౌత్ కనెక్షన్ బాగానే వర్కవుట్ అయింది. అప్పట్లో దిల్ సే.. ఆ తర్వాత చెన్నై ఎక్స్‌ప్రెస్ ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు జవాన్‌లో ఉన్నదంతా దక్షిణమే. ఈ సినిమాకు దర్శకుడు అట్లీ కాగా.. హీరోయిన్ నయనతార.. విలన్ విజయ్ సేతుపతి.. పైగా విజయ్ గెస్ట్ అప్పియరెన్స్ చేసారు.
జవాన్‌లో విజయ్ ఉన్నారనే విషయంపై చాలా రోజులుగా చర్చ జరుగుతున్నా కన్ఫర్మేషన్ లేదు.. కానీ ఇప్పుడొచ్చేసింది. జవాన్‌లో విజయ్ ఉన్నారని ఆ సినిమాకు పనిచేసిన స్టంట్ డైరెక్టర్ యానిక్ బెన్ కన్ఫర్మ్ చేసారు. విజయ్ అప్పియరెన్స్ తమిళంలో జవాన్‌కు కలిసి రానుంది. గతంలో అక్షయ్ కుమార్ రౌడీ రాథోర్‌లో ఓ పాటలో మెరిసారు విజయ్. ఇన్నాళ్లకు మళ్లీ జవాన్‌లో గెస్ట్ రోల్ చేసారు దళపతి.