AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: మెడలో మంగళ సూత్రం.. కంగనా రనౌత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? వీడియో వైరల్

40 ఏళ్ల వయసులో కంగనా రనౌత్ రహస్యంగా పెళ్లి చేసుకుందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించే చర్చ. నుదుటిన సిందూరం, చేతులకు ఆకుపచ్చ గాజులు, మెడలో మంగళసూత్రంతో కనిపిస్తోన్న ఆమె ఫొటోలు, వీడియోలు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Kangana Ranaut: మెడలో మంగళ సూత్రం.. కంగనా రనౌత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? వీడియో వైరల్
Actress Kangana Ranaut
Basha Shek
|

Updated on: May 22, 2026 | 2:26 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు పెళ్లయిందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే, కంగనా మెడలో మంగళ సూత్రం, చేతులకు ఆకుపచ్చ గాజులు ఉన్న ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో అందరూ కంగనా లుక్ గురించే మాట్లాడుకుంటు్నారు? కంగనా రహస్యంగా పెళ్లి చేసుకుందా? వరుడు ఎవరు? వంటి అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. కంగనా రనౌత్ తన ఇంటి నుంచి కారు వైపు వెళ్తున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో లేత గులాబీ రంగు చీర ధరించి న కంగనా నుదుటిపై బొట్టు పెట్టుకుని కనిపించింది. అలాగే ఆమె చేతిలో ఆకు పచ్చ గాజులు, మెడలో నల్లపూసల దండ కూడా ఉంది. అయితే ఈ లుక్ ను చూసి చాలా మంది కంగనాకు పెళ్లై పోయిందని అనుకుంటున్నారు. అయితే అదంతా అబద్ధం. కంగనా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘తను వెడ్స్ మను 3’ సినిమా కోసమే ఆమె ఇలా ముస్తాబైందని తెలుస్తోంది. అలాగే క్వీన్ 2 మూవీ కోసం కంగనా ఇలా రెడీ అయిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

కంగనా కెరీర్ లో మర్చిపోలేని చిత్రం క్వీన్. 2013లో రిలీజైన ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో తన అద్భుతమైన నటనకు కంగనా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. ఇప్పుడు, ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ‘క్వీన్ ఫరెవర్’ (వర్కింగ్ టైటిల్) పేరుతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ముంబైలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించారు. కంగనా కూడా ఈ షూటింగ్ షెడ్యూల్ కు హాజరవుతోంది.

ఇవి కూడా చదవండి

జూన్‌లో విడుదల కానున్న ‘భారత్ భాగ్య విధాత’:

‘క్వీన్ 2’తో పాటు, కంగనా నటించిన మరో ప్రధాన చిత్రం ‘భారత్ భాగ్య విధాత’ విడుదలకు సిద్ధంగా ఉంది. 2008 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో ఆసుపత్రిలో వందలాది ప్రాణాలను కాపాడిన ఓ నర్సు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆ సమయంలో నర్సులు, వార్డ్ బాయ్‌లు, జనరల్ హాస్పిటల్ సిబ్బంది సాటిలేని ధైర్యసాహసాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. మనోజ్ తపడియా దర్శకత్వం వహస్తోన్న ఈ చిత్రంలో కంగనా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..