AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న బిగ్ బాస్ బ్యూటీ.. త్వరలో అతనితో పెళ్లి.?

పై ఫొటోలో ఉన్న అందాల భామ ఎవరో గెస్ చేశారా? ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆమె. ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు కానీ ఇంతకు ముందు ఈ అమ్మడు పలు తెలుగు సినిమాల్లో కనిపించింది. కొన్ని సూపర్ హిట్ సినిమాలను ఖాతాలో వేసుకుంది.

Bigg Boss: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న బిగ్ బాస్ బ్యూటీ.. త్వరలో అతనితో పెళ్లి.?
Biggboss
Rajeev Rayala
|

Updated on: Jun 20, 2026 | 11:50 AM

Share

త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 10 మొదలుకానుంది. ఇప్పటికే 9 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ 10కు సిద్ధం అయ్యింది. కాగా బిగ్ బాస్ ద్వారా ఇప్పటికే చాలా మంది గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంది బిగ్ బాస్ పుణ్యమాని క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే కొంతమందికి హీరోయిన్ ఛాన్స్ కు కూడా వచ్చాయి. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న హీరోయిన్ ఒకరు. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్స్ అందుకోలేకపోయింది. దాంతో బిగ్ బాస్ గేమ్ షోలో ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ లో తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. అలాగే క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో తోటి కంటెస్టెంట్ తో లవ్ ట్రాక్ కూడా నడిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకోబోతుందని అంటున్నారు. ఆమె ఎవరో కాదు..

ఇది కూడా చదవండి : ఆ జబర్దస్త్ నటుడు నన్ను దారుణంగా మోసం చేశాడు.. పిచ్చిపిచ్చిగా తిట్టి, కొట్టి చాలా హింసించారు

మోనాల్ గజ్జర్..  ఈ అందాల భామ చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఎక్కువగా గ్లామర్ పాత్రలకే పరిమితమైనప్పటికీ తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైందీ అందాల తార. సాధారణంగా సినిమా హీరోయిన్లుగా కొనసాగుతూ ఎవరూ బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలకు వెళ్లరు. కానీ మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా కొనసాగుతుండగానే బిగ్ బాస్ తెలుగే సీజన్-4లో కంటెస్టెంట్ గా పాల్గొంది. తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అలాగే తోటి కంటెస్టెంట్ తో ప్రేమాయణం నడిపింది.

ఇది కూడా చదవండి : అందరూ అడుగుతున్నారు.. నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు.. సమంత ఎమోషనల్ కామెంట్స్

అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అందాల తారకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. దీంతో తన సొంత రాష్ట్రం గుజరాత్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడే సినిమాలు, టీవీ షోలు చేస్తూ బిజి బిజీగా ఉంటోంది. మోనాల్ సినిమాల విషయానికొస్తే సుడిగాడు సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసింది.  2014లో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి అనే సినిమాలో నటిగా కనిపించింది మోనాల్. తర్వాత గ్యాప్ తీసుకొని మళ్లీ 2021లో అల్లుడు అదుర్స్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ తో సందడి చేసింది. ఆ తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ గుజరాతి సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలతో బిజీగా ఉంటోంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు అఖిల్ తో బిగ్ బాస్ లో ప్రేమాయణం సాగించింది. బయకు వచ్చిన తర్వాత కూడా ఈ ఇద్దరూ కలిసి పలు షోల్లోనూ పాల్గొన్నారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తుంది. మోనాల్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి అఖిల్ పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వనుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : బాబోయ్..! ఇక్కడెక్కడి సినిమా రా అయ్యా..!! రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే

మోనాల్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ఇక్కడ చూడండి:

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us