
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ సినిమా డెకాయిట్. షానీల్ డియో తెరకెక్కించిన ఈ లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఇందులో ఆయన పవర్ ఫుల్ విలన్ రోల్ చేశారు. వీరితో పాటు ప్రకాశ్ రాజ్ ,సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల, జయన్ మేరీ ఖాన్ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా ఎట్టకేలకు రేపు (ఏప్రిల్ 10) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డెకాయిట్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సుప్రియ నిర్మించిన డెకాయిట్ సినిమాలో మొదట శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె తోనే కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. అయితే ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా ఈ మూవీ నుంచి శ్రుతి హాసన్ తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో మృణాళ్ ఠాకూర్ ను తీసుకుని ఈ ప్రేమ కథా చిత్రాన్ని పూర్తి చేశారు మేకర్స్.
అయితే హీరోయిన్ విషయంలోనే కాదు హీరో విషయంలోనూ ఇలాంటిదే ఒకటి జరిగిందట. డెకాయిట్ సినిమా కథని మొదట అక్కినేని హీరో అయిన అఖిల్ కి వినిపించారట మేకర్స్. అయితే వివిధ కారణాలతో అఖిల్ ఈ సినిమాను చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదట.
దాంతో మేకర్స్ ఈ కథను అడివి శేషు దగ్గరికి తీసుకెళ్లారట. అతను కథ విని కొన్ని మార్పులు, చేర్పులు సూచించి మూవీ చేసేందుకు ఒకే చెప్పారట. అలా డెకాయిట్ సినిమా పట్టాలెక్కిందట.
కాగా టాలీవుడ్ లో డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తున్నాడు అడివి శేష్. క్షణం, ఎవరు, గూడచారి, మేజర్, హిట్ 2 వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. హీరోగా శేష్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే హిట్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అడివి శేష్ ఇప్పుడు డెకాయిట్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు.
Meet the #Dacoit duo @AdiviSesh & @mrunal0801 along with the Team in Hyderabad & Vizag tomorrow (April 10th) ❤️🔥
📍 Hyderabad
8 AM – Prasad’s Multiplex📍 Vizag
Matinee – Sangam Theatre
Evening – Sree Kanya Cinemas, GajuwakaBook your tickets now!
🎟️ https://t.co/fCtmCkNlAI… pic.twitter.com/0vaCdA3Eqo— Annapurna Studios (@AnnapurnaStdios) April 9, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.