Game Changer: పూర్తి సంతృప్తి లేదు.. గేమ్ ఛేంజర్‌పై శంకర్ సంచలన వ్యాఖ్యలు..!

| Edited By: Janardhan Veluru

Jan 15, 2025 | 6:44 PM

గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్స్‌ ఊహించిన స్థాయిలో లేదని ప్రచారం జరుగుతున్నా.. మేకర్స్ మాత్రం కలెక్షన్స్ ఓకే అంటున్నారు. ఇప్పుడు ఈ మూవీపై దర్శకుడు ఎస్ శంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మూవీ ఔట్ కమ్ పట్ల తాను పూర్తిగా సంతృప్తి చెందడం లేదని శంకర్ చెప్పారు.

Game Changer: పూర్తి సంతృప్తి లేదు.. గేమ్ ఛేంజర్‌పై శంకర్ సంచలన వ్యాఖ్యలు..!
Game Changer
Follow us on

RRR లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమా గేమ్ చేంజర్. అలాగే శంకర్ తెరకెక్కించిన మొదటి తెలుగు సినిమా ఇది. అన్నింటికీ మించి రూ.350 కోట్లకు పైగా బడ్జెట్ తో దిల్ రాజు తన బ్యానర్లో 50వ సినిమాగా గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు. ఈ సినిమాకు ఊహించిన రెస్పాన్స్ అయితే రావట్లేదన్న ప్రచారం జరుగుతున్నా.. మేకర్స్ మాత్రం కలెక్షన్స్ పరంగా ఓకే అంటున్నారు. పొలిటికల్ జోనర్ సినిమా కావడం.. మొదటి రోజే మిక్డ్స్ రివ్యూస్ రావడంతో అనుకున్న వసూళ్లు తేవడంలో గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ అంచనాలను అందుకోవడంలో కాస్త వెనకబడినట్లు టాక్ వినిపిస్తోంది. చాలా ఏళ్ళ తర్వాత శంకర్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ఓరియెంటెడ్ సినిమా ఇది. శివాజీ తర్వాత పూర్తిగా టెక్నికల్ సినిమాల వైపు వెళ్లిపోయాడు ఈ దర్శకుడు. రోబో, ఐ, 2.0 అన్నీ పూర్తిగా విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమాలే.

ఇందులో రోబో మినహాయిస్తే.. ఏదీ వర్కవుట్ కాలేదు. అందుకే తన స్ట్రాంగ్ జోన్ అయిన పొలిటికల్ కథ వైపు వచ్చాడు శంకర్. పొలిటికల్ కాన్సెప్ట్ డీల్ చేయడంలో శంకర్ స్టైలే వేరు. అది జెంటిల్‌మెన్ అయినా.. ఒకే ఒక్కడు అయినా.. ఇండియన్ అయినా..! సినిమా ఏదైనా ఇష్యూను తీసుకుని రాజకీయంగా దాన్ని బాగా చూపిస్తారు శంకర్. చాలా ఏళ్ళ తర్వాత గేమ్ ఛేంజర్‌తో ఇదే చేయాలని ప్రయత్నించాడు శంకర్. కానీ అది వర్కవుట్ అవ్వనట్లే అనిపిస్తుందిప్పుడు పరిస్థితులు చూస్తుంటే. ఓవైపు మిక్డ్స్ టాక్.. మరోవైపు పైరసీ.. ఇంకోవైపు డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం దండయాత్ర మధ్యలో పడి రామ్ చరణ్ సినిమా కలెక్షన్స్ ఢీలా పడినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాపై కొన్ని కామెంట్స్ చేసాడు శంకర్. ఈ సినిమా ఔట్ పుట్‌పై పూర్తిగా సంతృప్తి చెందలేదని చెప్పాడు ఈ దర్శకుడు. అంతేకాదు.. సినిమా నిడివి 5 గంటలు ఉందని.. కథ చాలా వరకు అలాగే మిగిలిపోయిందని.. అవన్నీ కూడా సినిమాలో ఉండుంటే ఇంకా బాగుండేదన్నారు శంకర్. ఫ్లాష్ బ్యాక్‌లో అప్పన్న ఎపిసోడ్ కూడా గంట ప్లాన్ చేస్తే.. 20 నిమిషాలకే కుదించాల్సి వచ్చిందని చెప్పాడు శంకర్.

గేమ్ ఛేంజర్‌పై ఎస్ శంకర్ కామెంట్స్..