IIFA 2024: సత్తా చాటిన తెలుగు చిత్రాలు.. ఐఫా 2024 విన్నర్స్ వీరే.. ఉత్తమ నటుడిగా షారుఖ్, నాని..

|

Sep 29, 2024 | 12:03 PM

ఈ వేడుకలో బాలీవుడ్ సినీ స్టార్స్ షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, విక్కీ కౌశల్ వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. దక్షిణాది నుంచి ఉత్తమ సినిమాగా జైలర్ నిలవగా.. ఉత్తమ నటుడిగా దసరా సినిమాకు నాని పురస్కారం అందుకున్నారు. అలాగే సౌత్ నుంచి ఐఫా 2024 అవార్డ్స్ వేడుకలలో దసరా మూవీ పలు విభాగాల్లో పురస్కారాలు అందుకుంది.

IIFA 2024: సత్తా చాటిన తెలుగు చిత్రాలు.. ఐఫా 2024 విన్నర్స్ వీరే.. ఉత్తమ నటుడిగా షారుఖ్, నాని..
Iifa 2024 Winners
Follow us on

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే వేడుక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA 2024). ఈ అవార్డుల మహోత్సం అబుదాబిలో కన్నుల పండగగా జరిగింది. ఈ కార్యక్రంలో తొలిరోజు దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన సినిమాలు, నటీనటులకు అవార్డులు అందచేశారు. ఇక రెండో రోజు బాలీవుడ్ సినిమాలు, తారలకు పురస్కారాలు అందించారు. ముఖ్యంగా ఇందులో యానిమల్ సినిమా హావా కిపించింది. వివిధ విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. అలాగే జవాన్ సినిమాకు ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ పురస్కారం అందుకున్నారు. అలాగే ఉత్తమ చిత్రంగా యానిమల్ నిలిచింది. ఈ వేడుకలో బాలీవుడ్ సినీ స్టార్స్ షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, విక్కీ కౌశల్ వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. దక్షిణాది నుంచి ఉత్తమ సినిమాగా జైలర్ నిలవగా.. ఉత్తమ నటుడిగా దసరా సినిమాకు నాని పురస్కారం అందుకున్నారు. అలాగే సౌత్ నుంచి ఐఫా 2024 అవార్డ్స్ వేడుకలలో దసరా మూవీ పలు విభాగాల్లో పురస్కారాలు అందుకుంది.

ఈ కార్యక్రమంలో షారుఖ్ తన హోస్టింగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. విక్కీ కౌశల్, కరణ్ జోహార్ తో కలిసి సూపర్ హిట్ పాటలకు స్టెప్పులేశారు. ఐఫా 2024లో విజేతలు ఎవరెవరో ఇక్కడ తెలుసుకోండి.

  • ఉత్తమ చిత్రం – యానిమల్
  • ఉత్తమ నటుడు – షారుఖ్ ఖాన్ (జవాన్)
  • ఉత్తమ నటి – రాణి ముఖర్జీ (శ్రీమతి ఛటర్జీ vs నార్వే)
  • ఉత్తమ దర్శకుడు – విధు వినోద్ చోప్రా (12వ ఫెయిల్)
  • ఉత్తమ సహాయ నటుడు – అనిల్ కపూర్ (యానిమల్)
  • ఉత్తమ సహాయ నటి – షబానా అజ్మీ (రాకీ రాణి)
  • ఉత్తమ విలన్ – బాబీ డియోల్ (యానిమల్)
  • ఉత్తమ కథ – రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ
  • ఉత్తమ కథ (Adapted) – 12వ ఫెయిల్
  • ఉత్తమ సంగీతం – యానిమల్
  • ఉత్తమ సాహిత్యం – యానిమల్ (సిద్ధార్థ్ – గరిమ, సత్రాంగ)
  • ఉత్తమ గాయకుడు – భూపిందర్ బబ్బల్, అర్జన్ వ్యాలీ (యానిమల్ )
  • ఉత్తమ సింగర్ ఫిమేల్ – శిల్పా రావు (చలేయ)
  • ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా – జయంతిలాల్ గడ, హేమ మాలిని
  • అచీవ్‌మెంట్ ఆన్‌ కంప్లీటింగ్‌ 25 ఇయర్స్‌ ఇన్‌ సినిమా – కరణ్ జోహార్

దక్షిణాది చిత్రాలు విజేతలు వీరే..

ఇవి కూడా చదవండి
  • ఉత్తమ చిత్రం (తమిళం): జైలర్
  • ఉత్తమ నటుడు (తెలుగు): నాని (దసరా)
  • ఉత్తమ నటుడు (తమిళం): విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్: II)
  • ఉత్తమ నటి (తమిళం): ఐశ్వర్య రాయ్ (పొన్నియిన్ సెల్వన్: II)
  • ఉత్తమ దర్శకుడు (తమిళం): మణిరత్నం (పొన్నియిన్ సెల్వన్: II)
  • ఉత్తమ సంగీత దర్శకత్వం (తమిళం): , AR రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్: II)
  • ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా : చిరంజీవి
  • ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా : ప్రియదర్శన్‌
  • ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఇండియన్ సినిమా: సమంత
  • ఉత్తమ విలన్‌ (తమిళం) : ఎస్‌జే సూర్య (మార్క్‌ ఆంటోనీ)
  • ఉత్తమ విలన్ (తెలుగు) : షైన్ టామ్ చాకో (దసరా)
  • ఉత్తమ విలన్ (మలయాళం) : అర్జున్ రాధాకృష్ణన్ (కన్నూర్ స్క్వాడ్)
  • ఉత్తమ సహయ నటుడు (తమిళం) : జయరామ్ (పొన్నియిన్ సెల్వన్: II)
  • ఉత్తమ సహయ నటి (తమిళం) : సహస్ర శ్రీ (చిత్త)
  • గోల్డెన్ లెగసీ అవార్డు: నందమూరి బాలకృష్ణ
  • కన్నడ సినిమాలో అత్యుత్తమ ప్రతిభ: రిషబ్ శెట్టి
  • బెస్ట్ డెబ్యూ (మహిళ – కన్నడ): ఆరాధనా రామ్ (కాటెరా)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.