సినీ నటికి లైంగిక వేధింపులు.. సినిమా ఛాన్స్‌లు ఇప్పిస్తా అంటూ పిచ్చివేశాలు.. కేసు నమోదు

క్యాస్టింగ్ కౌచ్ అనేది సినీ ఇండస్ట్రీలో చాలా పెద్ద చర్చకు దారితీసింది. ఎంతో మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. నిర్మాతలు, దర్శకులు, కొన్ని సార్లు హీరోలు లైంగికంగా వేధించారు అని చాలా మంది బయటకొచ్చి దైర్యంగా మీడియా ముందు చెప్తున్నారు.

సినీ నటికి లైంగిక వేధింపులు.. సినిమా ఛాన్స్‌లు ఇప్పిస్తా అంటూ పిచ్చివేశాలు.. కేసు నమోదు
Actress

Updated on: Jun 15, 2026 | 10:22 AM

సినిమాల్లో అవకాశం ఇస్తాము, మాకు సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయం ఉంది ఇలా మాయమాటలు చెప్పి చాలా మంది ప్రజలను మోసం చేస్తుంటారు. అమాయక అమ్మాయిలను సినిమా పేరుతో లొంగదీసుకుని వారిపై లైంగిక దాడి చేస్తుంటారు కొందరు. తాజాగా హైదరాబాద్ లో అదే జరిగింది. సినిమాల్లో అవకాశాల పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ప్రసాద్ అనే వ్యక్తి. ఓ నటికి సినిమా ఆఫర్స్ ఇప్పిస్తామని ఆశ చూపించి ఆమెను లైంగికంగా వేధించాడు ప్రసాద్. దాంతో ఆమె బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇది కూడా చదవండి : కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న సినిమా

క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్‌ తనను వేధించాడంటూ  ఆ నటి ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల ఓ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌ క్యారెక్టర్ చేసింది ఆ నటి. అయితే షూటింగ్ పూర్తయినప్పటికీ ఆమెకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు. గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆమె సినిమా షూటింగ్ లో పాల్గొంది. అయితే ఆమెకు రెమ్యునరేషన్ గా రూ. 90వేలు ఇవ్వాల్సి ఉండగా ఆ డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేసాడు ప్రసాద్.

ఇది కూడా చదవండి : ఇంటర్వెల్ సీన్ మార్చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది

కాగా బంజారాహిల్స్ లోని ఓ ప్రముఖ నిర్మాత ఇంటికి రావాలని ఆమెకు ఫోన్ చేశాడు ఆ ప్రసాద్ అనే వ్యక్తి. డబ్బులు ఇవ్వకపోగా ఆమెను ను బలవంతంగా కారులోకి ఎక్కించి కొంతదూరం తీసుకువెళ్లిన తర్వాత మరిన్ని సినిమా ఆఫర్స్ ఇప్పిస్తానని అయితే అందుకు బదులుగా తన కోరిక తీరచాలంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతని నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆ నటి జరిగిన విషయాన్నీ తల్లికి చెప్పుకుంది. దాంతో ఆమె తల్లి ప్రసాద్ కు ఫోన్ చేసి నిలదీయగా ఆమెతో కూడా అతను దుర్భాషలాడాడు. దాంతో ఆ నటి ప్రసాద్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో బంజారాహిల్స్ పోలీసులు అతని పై కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ డాన్స్ ఏంటి అమ్మడు..! హ్యాపీ రీ రిలీజ్‌లో రచ్చ చేసిన హీరోయిన్.. థియేటర్ దద్దరిల్లిందిగా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us