ఫుడ్, మందులు నేనే పంపిస్తాను.. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. చివరిగా అతను నటించిన ఆంధ్రాకింగ్ తాలుకా సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఎందుకోగానీ ఈ మూవీ కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతం తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉంటున్నాడు రామ్.

ఫుడ్, మందులు నేనే పంపిస్తాను.. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతికి రామ్ పోతినేని వీడియో కాల్
Ram Pothineni

Updated on: Aug 20, 2026 | 7:07 AM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ క్రేజీ హీరో తన అభిమాని పట్ల గొప్పమనసు చాటుకున్నాడు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న లేడీ ఫ్యాన్ కు భరోసా కల్పించి మంచి మనసు చాటుకున్నాడు రామ్. ఆమెను నేరుగా కలవకపోయినా.. వీడియో కాల్ ద్వారా ఆమెను పరామర్శించి. ఆమె బాగోగులు అడిగి తెలుసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా దుప్పలపూడికి చెందిన శశి భవ్యత అనే 18 ఏళ్ల యువతీ అరుదైన వ్యాధితో బాధపడుతుంది. జన్యు సంబంధిత వ్యాధితో కొన్నేళ్లుగా మంచానికే పరిమితం అయ్యింది ఆమె.. అయితే ఆమెకు హీరో రామ్ అంటే చాలా ఇష్టం.. టీవీల్లో అతని సినిమాలను చూసి అభిమాని అయ్యింది. నిత్యం రామ్ ఫోటోలు, వీడియోలు చూపిస్తూ ఆమెకు తల్లి దండ్రులు అన్నం తినిపించడం, మందులు వేయడం లాంటివి చేస్తుంటారు.

ఇది కూడా చదవండి :

చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్

అయితే ఇటీవల ఆమెకు సంబందించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రామ్ పై అభిమానం, ఆయనను చూడాలన్న ఆమె కోరికను రామ్ అభిమానులు నెరవేర్చారు. శశి భవ్యతకు సంబందించిన వీడియోలను హీరో రామ్ వరకు చేరాలా చేశారు కొందరు ఫ్యాన్స్, నెటిజన్స్. దాంతో రామ్ స్పందించాడు. ఆ అమ్మాయికి స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడాడు హీరో రామ్. ఆమె.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ

ఆమె వైద్యానికి అయ్యే మందులు, ఇతర ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నాడు రామ్ పోతినేని. శశి భవ్యత తల్లి దండ్రులకు దైర్యం చెప్పాడు రామ్. ఎప్పుడు వస్తావ్ సార్ అంటూ అమాయకంగా అడిగింది శశి భవ్యత. దానికి రామ్ సమాధానమిస్తూ..” వస్తాను. నేను రావాలంటే నువ్వు మంచిగా అన్నం తిని, మందులు వేసుకొని బలంగా అవ్వాలి. ఇక నుంచి ఫుడ్, మందులు నేనే పంపిస్తాను. టైముకి తిని మందులు వేసుకుంటే నువ్వు బలంగా అవుతావు. అప్పుడు నువ్వు హైదరాబాద్ రావాలి. మనం కలవాలి. నాకు నిన్ను కలవాలని ఉంది అంటూ ప్రేమగా సమాధానం చెప్పాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి :

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us