
చాలా మంది హీరోలు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఎన్నో సేవ కార్యక్రమాలు కూడా చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. చాలా మంది హీరోలు ప్రజలకు సేవలు చేయడంలోనూ ముందుంటారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అలాగే మహేష్ బాబు వేలకు 4 వేలకు పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించారు. ఇక సోనూ సూద్, లారెన్స్ లాంటి వారి గురించి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఇలా చాలా మంది హీరోలు ప్రజలకు సేవలు చేస్తున్నారు అలాగే యంగ్ హీరో మంచు మనోజ్ కూడా తనకు చేతనంత సాయం చేస్తూ ఉంటారు. అంతే కాదు ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే చాలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు.
తాజాగా ఓ చిన్నారిని కాపాడాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు. గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ చిన్నారిని కాపాడాలని పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. సేవ్ పునర్విక పేరుతో కొందరు ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక అరుదైన SMA టైప్ 1 వ్యాధితో పోరాడుతోంది. ఆమె ప్రాణాలు దక్కాలంటే రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అత్యవసరం. దాంతో ఆ చిన్నారిని కాపాడాలని చాలా మంది విరాళాలు సేకరిస్తున్నారు.
ఈ విషయంపై హీరో మంచు మనోజ్ స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు. “ఇది నా మనసును బాగా కలచి వేసింది. బేబీ పునర్విక అరుదైన, ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతోంది. ఒక ఇంజెక్షన్ ఆమె ప్రాణాలను కాపాడుతుంది. ఆ ఇంజెక్షన్ ఖర్చు రూ.16 కోట్లు. ఆ బిడ్డ బతకడానికి రూ.16 కోట్లు కావాలి. కానీ ఇక్కడ నన్ను ఎక్కువగా కదిలించింది ఏంటంటే… ప్రజలు మనకెందుకులే అని వదిలేయకుండా.. పరిచయం లేనివారు, కుటుంబాలు, సాధారణ వ్యక్తులు కలిసి వచ్చి సేవ్ పునర్విక అంటూ రూ. 1 కోటి కంటే ఎక్కువ సేకరించారు అంటూ PMOఇండియాను, తెలంగాణ సీఎంఓ ను, ఆంధ్రప్రదేశ్ సీఎంను ట్యాగ్ చేసి దయచేసి జోక్యం చేసుకోండి అని రిక్వెస్ట్ చేశారు. ఈ చిన్నారికి తక్షణ సహాయం కావాలి. ఒక చిన్న అభ్యర్థన. ఆరోగ్య పరిస్థితి చాలా సున్నితంగా ఉన్నందున దయచేసి ఎవరూ ఆమెను ప్రత్యక్షంగా కలవడానికి ప్రయత్నించకండి. మీ ప్రార్థనలు, సహకారాలు ఇప్పుడు చాలా ముఖ్యమైనవి. ఈ చిన్నారి కోలుకుంటే, ఆమె కుటుంబం మాత్రమే గెలవదు. మనమందరం గెలుస్తాము అంటూ మనోజ్ రాసుకొచ్చారు.
This broke me.
Baby Punarvika. SMA Type 1. A rare, fatal condition. One injection can save her life. That injection costs ₹16 crores.
₹16 crores for a baby to live.
But here’s what hit me harder. People didn’t look away. Strangers, families, regular people came together and… pic.twitter.com/ul7jUzi5Uc
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) February 24, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.